Nikhil: హ్యాపీడేస్ సినిమాతో హీరోగా వరుణ్ సందేశ్‌కి ఎంత క్రేజ్ వచ్చిందో, ఫ్రెండ్‌గా నటించిన నిఖిల్ కి కూడా అంతే క్రేజ్ వచ్చింది. హ్యాపీడేస్ తర్వాత నిఖిల్ సోలో హీరో అయిపోయాడు. చెప్పాలంటే వరుణ్ సందేశ్ కంటే ఇప్పుడు నిఖిల్ కే మంచి మార్కెట్ ఉంది. ఎన్ని ప్రయోగాలు చేసినా వరుణ్ సందేశ్ కి అసలు మార్కెట్ ఏర్పడలేదు గానీ, నిఖిల్ కి మాత్రం సౌత్ లో తన సినిమాలకి మంచి బిజినెస్ అవుతోంది. కార్తికేయ, స్వామి రారా, కార్తికేయ 2, ఎక్కడికిపోతావు చిన్నవాడా, కిరాక్ పార్టీ లాంటి సినిమాలతో తనకంటూ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్‌ని ఏర్పరుచుకున్నాడు.
సాధారణంగా మన టాలీవుడ్ లో ఒక హీరోకి ఫ్లాప్ పడితే మళ్ళీ త్వరగా పైకి లేవడం చాలా కష్టం. అలా ఫ్లాప్ పడిన వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, అఖిల్, రామ్ పోతినేని లాంటి హీరోలు మళ్ళీ హిట్ కోసం చాలా తాపత్రయపడుతున్నారు. ఆ లిస్ట్ లో నిఖిల్ కూడా ఉన్నాడు. కార్తికేయ 2 తర్వాత ఈ హీరో చేసిన ’18 పేజెస్’, ‘స్పై’, ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’.. సినిమాలు వరుసగా ఫ్లాపయ్యాయి. దీంతో నిఖిల్ సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం నిఖిల్ ‘స్వయంభు’ అనే సినిమా చేస్తున్నాడు.
ఇక ఇప్పటికే ‘స్వయంభు’ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశాడు. ఈ మూవీకి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను జరుపుకుంటుంది. అలాగే, నిఖిల్ చేతిలో ‘ది ఇండియా హౌస్’ అనే మరో సినిమా కూడా ఉంది. రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగానే తెరకెక్కుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 40 శాతం షూటింగ్ పూర్తైంది. అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘కార్తికేయ 2’ తర్వాత మళ్ళీ ‘స్వయంభు’, ‘ది ఇండియా హౌస్’ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.
ఈ రెండు సినిమాలే కాకుండా మరో సినిమాకి నిఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సోషియో ఫాంటసీ సూపర్ హీరో సినిమాగా తెరకెక్కబోతున్న ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ లో ఉంది. త్వరలోనే సెట్స్ పైకి రాబోతుంది. అలాగే, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నటీనటులు, టెక్నికల్ టీమ్ కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడయ్యే అవకాశముంది. మొత్తానికి నిఖిల్ ప్రస్తుతానికి మూడు క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. ఈ సినిమాలలో.. ఏ రెండు హిట్ సాధించినా, నిఖిల్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడు. చూడాలి మరి ఈ యంగ్ హీరో చేస్తున్న ప్రయోగాలు ఎతవరకూ సక్సెస్ అవుతాయో.
Also Read- OG Movie: ఓజీలో ఛాన్స్ కొట్టేసిన డీజే టిల్లు హీరోయిన్ – పవన్ కళ్యాణ్‌తో స్పెషల్ సాంగ్!


