Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభNarne Nithiin: ఎన్టీఆర్ బావమరిదికి పెళ్లి ఫిక్స్! ఎన్టీఆర్, వెంకటేష్ బంధువులు కాబోతున్నారు?

Narne Nithiin: ఎన్టీఆర్ బావమరిదికి పెళ్లి ఫిక్స్! ఎన్టీఆర్, వెంకటేష్ బంధువులు కాబోతున్నారు?

Narne Nithiin: ఎన్టీఆర్ బావమరిది అయినా యంగ్ హీరో నార్నే నితిన్ గురించి ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది! ‘మ్యాడ్ (Mad)’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, హ్యాట్రిక్ హిట్స్ తో అంచనాలు పెంచుతున్న నితిన్.. ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. శివాని అనే అమ్మాయితో నితిన్, నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థం నవంబర్ 3, 2024 న ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్‌కు టాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున సెలబ్రిటీలు హాజరై సందడి చేసారు.

- Advertisement -

పెళ్లి ముహూర్తం ఫిక్స్.. అక్టోబర్ 10న!
నిశ్చితార్థం తర్వాత ఇప్పుడు పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ జంట అక్టోబర్ 10వ తేదీన కలిసి ఏడు అడుగులు వేయబోతున్నారని తెలుస్తోంది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/rashmika-mandanna-kannada-industry-ban-clarification/

నితిన్ పెళ్లి చేసుకోబోతున్న శివాని, నెల్లూరు జిల్లాకు చెందిన వెంకట కృష్ణ ప్రసాద్, స్వరూప దంపతుల కుమార్తె.వీరి కుటుంబానికి నెల్లూరులో రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా, శివాని టాలీవుడ్ హీరో దగ్గుబాటి వెంకటేష్ కుటుంబానికి కూడా సమీప బంధువులని సమాచారం.మొత్తానికి, టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీస్ బంధుత్వాన్ని మరింత పెంచే ఈ వివాహ వార్త, ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/nayanthara-fake-bomb-threat-chennai/

నితిన్ కెరీర్ కూడా ఇప్పుడు ఊపందుకుంది. ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ సినిమాతో ఆడియెన్స్‌ను పలకరించిన నితిన్, తన నటన, ఎనర్జీతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘మ్యాడ్’ ఫ్రాంచైజీలో మూడో సినిమా ‘మ్యాడ్ క్యూబ్’ కోసం కూడా నితిన్ సిద్ధమవుతున్నాడు. ఇలా కెరీర్ ఫుల్ జోష్‌లో ఉన్నప్పుడే పెళ్లికి రెడీ అవ్వడం విశేషం.నిశ్చితార్థం జరిగి సంవత్సరం అవుతున్నా, పెళ్లి డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త ఏంటంటే… అక్టోబర్ 10న నితిన్, శివాని వివాహం ఘనంగా జరగనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad