Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభNithya Menon: పాపం.. ప్రభాస్ పేరును కలవరిస్తున్న నిత్యామీనన్!

Nithya Menon: పాపం.. ప్రభాస్ పేరును కలవరిస్తున్న నిత్యామీనన్!

- Advertisement -

Nithya Menon: పాన్ ఇండియా హీరోగా ఫుల్ స్వింగ్ లో ఉన్న ప్రభాస్ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా అభిమానులను ఎలా ఖుషీ చేయాలా అని తెగ కష్టపడిపోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ అభిమాన గణాన్ని పెంచుకొనే పనిలో ఉన్న ప్రభాస్ అంటే ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులను కూడా ఫెవరెట్ హీరోనే. అయితే ఓ హీరోయిన్ మాత్రం ప్రభాస్ అంటే ఎవరో తెలియదని చెప్పేసింది.

ఔను.. మలయాళ బొద్దుగుమ్మ నిత్యా మీనన్ ను మీడియా ప్రతినిధి ప్రభాస్ గురించి అడిగితే ఆయనెవరు అని ఎదురు ప్రశ్న వేసింది. అయితే.. ఇది ఇప్పుడు కాదు. నిత్యా కేరీర్ తొలినాళ్ళలో జరిగిన సంఘటన. అప్పటికి ప్రభాస్ కూడా పాన్ ఇండియా స్థాయిలో పెద్ద ఐడెంటిఫికేషన్ లేకపోగా నిత్యాకు మలయాళ, తమిళ సినిమాలు తప్ప మిగతా ఇండస్ట్రీలలో హీరోల గురించి పెద్దగా తెలియకపోవడంతో ఈ తప్పు జరిగిపోయింది.

అప్పట్లో ఈ ఘటనతో మీడియాతో పాటు సోషల్ మీడియాలో నిత్యా మీనన్ తో ఓ ఆట ఆడేసుకున్నారు. ఆ తర్వాత నిత్యా కూడా ఇంటర్వ్యూలకు పెద్దగా హాజరయ్యేది కాదు. ఇది ఎంతగా నిత్యా మర్చిపోలేకపోతుంది అంటే పదేళ్ల తర్వాత కూడా ఈ మధ్యనే ఓ ఇంటర్వూలో కూడా గుర్తు చేసుకొని మరీ బాధపడిపోయింది. నిత్యా ఇప్పటికీ ఆ ఘటనను, ప్రభాస్ పేరును కలవరిస్తుండడంతో మరోసారి సోషల్ మీడియాలో డార్లింగ్ ఫ్యాన్స్ కు ఇదే హాట్ టాపిక్ అయింది. ఏది ఏమైనా సెలబ్రిటీలు ఎవరైనా కెమెరాల ముందు, సోషల్ మీడియాలో ఆచితూచి మాట్లాడాలని ఈ సంఘటన గుర్తు చేస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad