Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తెలుసు కదా మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నీరజ కోన డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న ఈ మూవీలో రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సోమవారం ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో తెలుసు కదా మూవీ గురించి సిద్ధు జొన్నలగడ్డ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఒక్క లిప్‌లాక్ ఉండదు…
“ఈ సినిమాలో ఒక్క లిప్‌లాక్ సీన్ ఉండదు. కథ ఓకే చెప్పినప్పుడే కిస్ సీన్లు లేకుండా సినిమా చేద్దామని డైరెక్టర్ నీరజ కోనతో చెప్పా. లిప్‌లాక్ లేకపోయినా అంతకుమించిన హై ఫీలింగ్‌ను ఈ మూవీ ఇస్తుంది. ఫిజికల్‌గా కంటే ఎమోషనల్ ఇంటిమసీ ఈ సినిమాలో చూపించాం అని సిద్ధు జొన్నలగడ్డ అన్నారు.
తెలుగుసు కదాలో తన క్యారెక్టర్ చాలా రాడికల్‌గా ఉంటుందని” సిద్ధు జొన్నలగడ్డ చెప్పాడు.
రాశీఖన్నా వెళ్లిపోయింది…
“సినిమాలో నేను లవ్ గురించి మాట్లాడే పద్దతి, నా క్యారెక్టర్ ఐడియాలజీ చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటాయి. క్లైమాక్స్ చేసేటప్పుడు నేను ఈ సీన్ చేయనని రాశీఖన్నా సెట్ నుండి వెళ్లిపోయింది. నలభై నిమిషాల వరకు షూటింగ్ అపేసింది. అలా ఎలా మాట్లాడుతాడు నా బాయ్‌ఫ్రెండ్, అలా మాట్లాడితే చంపేస్తాను, వదిలేస్తాను అంటూ కోపంతో చిందులు తొక్కింది. నువ్వు రాశీఖన్నావి అంజలి కాదని, ఇది సినిమా అని చెప్పి ఆమెను కూల్ చేశాం. అంతలా క్యారెక్టర్‌లో లీనమైంది. టిల్లు పాత్రకు తెలుసు కదాలో నేను చేసిన క్యారెక్టర్‌కు ఎలాంటి సంబంధం ఉండదు. టిల్లుకు మించిన కామెడీ ఈ సినిమాలో ఉంటుంది” అని అన్నారు.
Also Read – Telangana Rains Alert : తెలంగాణలో భారీ వర్షాలు.. 17 జిల్లాలకు హై అలర్ట్
మోస్ట్ డార్కెస్ట్ మూవీ…
“సాప్ట్ రోల్స్ చేసి బోర్ కొట్టింది. యాక్టర్‌గా నా లిమిట్స్ మొత్తం దాటేసి బ్యాడ్‌యాస్ సినిమా చేస్తున్నాను. టాలీవుడ్‌లోనే మోస్ట్ డార్కెస్ట్ మూవీగా బ్యాడ్‌యాస్ ఉంటుంది”అని సిద్ధు జొన్నలగడ్డ పేర్కొన్నాడు.
రవితేజతో మల్టీస్టారర్ మూవీపై ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో సిద్ధు జొన్నలగడ్డ రియాక్ట్ అయ్యాడు. “గతంలో నేను, రవితేజ కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలని అనుకున్నాం. కానీ అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. మంచి కథ దొరికితే తప్పకుండా రవితేజతో మల్టీస్టారర్ సినిమా చేస్తా” అని సిద్ధు జొన్నలగడ్డ అన్నాడు.
ఈ దీపావళికి తెలుసు కదాతో పాటు మిత్రమండలి, కే ర్యాంప్, డ్యూడ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మొన్నటివరకు దీపావళి రిలీజ్‌లలో తెలుసు కదాపైనే ఎక్కువగా అంచనాలు నెలకొన్నాయి. కానీ ప్రమోషన్స్‌లో ఈ సినిమా వెనుకబడటం మైనస్‌గా మారింది. ప్రస్తుతం ఈ సినిమాపైనే బజ్ తక్కువగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read – Takshakudu: డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఆనంద్ దేవరకొండ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మూవీ – టైటిల్ ఇదే!


