SS Rajamouli Movies: రాజమౌళి…తెలుగు సినిమాను హాలీవుడ్‌కు లెవెల్‌కు తీసుకెళ్లిన డైరెక్టర్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ మూవీ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకొని చరిత్రను సృష్టించింది. టాలీవుడ్‌లో అవార్డులు, రికార్డులు, కలెక్షన్స్ ఏవైనా రాజమౌళి సినిమా తర్వాతే. ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ ఫైవ్ మూవీస్‌లో రాజమౌళి సినిమాలు రెండు ఉన్నాయి. తెలుగులో అత్యధిక కలెక్షన్స్‌ను రాబట్టిన మూవీగా రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 2 టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత మహేష్‌బాబుతో ఓ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు రాజమౌళి. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్…
మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా నటిస్తున్న జూనియర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ వేడుకలో తాను చేసిన సినిమాలపై రాజమౌళి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
ఈగ బెస్ట్ మూవీ…
తన కెరీర్‌లో బెస్ట్ మూవీగా ఈగ సినిమాను రాజమౌళి పేర్కొనడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆస్కార్ విన్నింగ్ మూవీ అయిన ఆర్ఆర్ఆర్‌తో పాటు స్టార్ హీరోలతో చేసిన బాహుబలి, ఛత్రపతి, మగధీర, యమదొంగ లాంటి సినిమాలను కాదని ఈగ సినిమా పేరును చెప్పడం ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది. ఈగ సినిమాతోనే రాజమౌళి పేరు పాన్ ఇండియా వైడ్‌గా ఫేమస్ అయ్యింది. ఈ సినిమాలో నాని, సమంత హీరోహీరోయిన్లుగా నటించారు.
మనసుకు నచ్చిన కథలతో…
ఈ ఈవెంట్‌లో ఈగతో పాటు నితిన్ సై మూవీ గురించి రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మాస్ సినిమాలకు కాకుండా మన మనసుకు నచ్చిన కథలతో సినిమాలు చేసి విజయాలను అందుకోవచ్చని సై నిరూపించిందని అన్నాడు. సై కూడా తన కెరీర్‌లో స్పెషల్ మూవీ అని పేర్కొన్నాడు. ఈగ, సై సినిమాల గురించి రాజమౌళి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
ప్రియాంక చోప్రా హీరోయిన్…
మరోవైపు మహేష్‌బాబుతో రాజమౌళి చేస్తోన్న సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో మహేష్‌బాబు, రాజమౌళి సినిమా రూపొందుతోన్నట్లు సమాచారం. ఇందులో మాధవన్, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు పలువురు సౌత్, బాలీవుడ్ నటులు కీలక పాత్రల్లో నటించబోతున్నారు. ఎస్ఎస్ఎమ్‌బీ 29 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు.
బాహుబలి రీ రిలీజ్…
రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి మూవీ అక్టోబర్ 31న థియేటర్లలో రీ రిలీజ్ కాబోతుంది. రెండు భాగాలను ఒకటి చేసి ప్రయోగాత్మకంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మూడు గంటల యాభై నిమిషాల రన్ టైమ్‌తో బాహుబలి రీ రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.
Also Read- Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’కి సెన్సార్ బోర్డ్ షాక్.. పవన్‌కు ఇష్టమైన వాయిసే లేపేశారుగా!


