Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభNTR-Allu Arjun: ఈ స్టార్స్ ఇద్దరూ ఫారిన్‌లో షూటింగ్‌కు రెడీ..

NTR-Allu Arjun: ఈ స్టార్స్ ఇద్దరూ ఫారిన్‌లో షూటింగ్‌కు రెడీ..

NTR-Allu Arjun: మన సౌత్ సహా బాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలకి సంబందించిన షూటింగ్ లో కొంత భాగమైనా తప్పకుండా విదేశీల్లో త‌ప్ప‌నిస‌రిగా ప్లాన్ చేస్తుంటారు. కథ, సన్నివేశాలు గనక డిమాండ్ చేస్తే ఖండాలు దాటక త‌ప్ప‌దు. గత కొంతకాలంగా పాన్ ఇండియా సినిమాలంటే ఏ రకంగానూ రాజీపడ‌టానికి ఛాన్సే ఉండ‌దు. ఒక‌వేళ బడ్జెట్ విషయంలో రాజీప‌డి సెట్స్ వేసినా? నేచురల్ లొకేష‌న్ల‌లో చూసిన అనుభూతి గ్యారెంటీగా రాదు. ఖ‌ర్చు చూసుకున్నా పెద్ద తేడా ఉండదు. ఎంత సెట్ల కోసం కోట్లు ఖ‌ర్చు చేయాల్సి వ‌చ్చినా నేచురల్ లొకేషన్స్ కాదని కనిపెట్టేయొచ్చు.

- Advertisement -

దాంతో మన దర్శక నిర్మాతలు సినిమా మేకింగ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాకుండా ఫారిన్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి, మహేశ్ సినిమాకి కూడా కెన్యాని ఎంచుకున్నారు. ఇక ప్ర‌స్తుతం మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తమిళ యువ దర్శకుడు అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా సినిమా ఒకటి తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ చిత్రీకరణ మొద‌లైనప్పటి నుంచి ఇండియాలోనే జ‌రుగుతోంది. ముంబైలో ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జ‌రుగుతోంది. అలాగే, ముంబై పరిసర ప్రాంతాలలోనే కొన్ని సెట్లు వేసి కూడా షూటింగ్ చేస్తున్నారు.

Also Read – Divya Bharathi: బంగారు చీరలో మెరిసిన బ్యాచిలర్‌ బ్యూటీ.. అమ్మడి లుక్‌కి కుర్రకారు ఫిదా..!

అల్లు అర్జున్, అట్లీ సినిమా ముంబై షెడ్యూల్ త్వ‌ర‌లోనే ముగియ‌నుంద‌ని సమాచారం. నెక్స్ట్ కొత్త షెడ్యూల్ అబుదాబిలో ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా భారీ షెడ్యూల్. దాదాపు 50 రోజుల పాటు అక్క‌డే చిత్రీకరణ ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక ఇదే షెడ్యూల్ లో బాలీవుడ్ హీరోయిన్ దీపికా ప‌దుకొణే కూడా జాయిన్ అవుతారట. అల్లు అర్జున్-దీపికల మ‌ధ్య కాంబినేష‌న్ స‌న్నివేశాలను పూర్తి చేస్తారట. ఆ తర్వాత అల్లు అర్జున్ పై కొన్ని యాక్షన్ సీన్స్ ని కూడా కంప్లీట్ చేసేందుకు షెడ్యూల్ ప్లాన్ చేశారట.

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పాన్ ఇండియా దర్శకుడు ప్ర‌శాంత్ నీల్ డ్రాగ‌న్ అనే వర్కింగ్ టైటిల్ తో భారీ యాక్షన్ సినిమాను తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొద‌లైనప్పటి నుంచి ఇండియాలోనే నాన్ స్టాప్ గా జ‌రుగుతోంది. ఎన్టీఆర్, నీల్ సినిమా షూటింగ్ ప్రస్తుతం క‌ర్ణాట‌క‌లో జరుగుతుండగా, ప్రధానమైన స‌న్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక చిత్ర యూనిట్ ఫారిన్ కి వెళ్ళబోతోంది. తాజా సమాచారం మేరకు డ్రాగ‌న్ చిత్రీక‌ర‌ణ మొత్తం పది దేశాలలో ప్లాన్ చేశారట. మన టాలీవుడ్ స్టార్స్ తో సినిమాలు చేస్తున్న అట్లీ గానీ, ప్రశాంత్ నీల్ గానీ ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా చిత్రాలను రూపొందిస్తున్నారు.

Also Read – One Plus 13 Discount: ఈ వన్ ప్లస్ ఫోన్ పై భారీ డిస్కౌంట్.. ఇప్పుడే త్వరపడండి!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad