War 2: బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 ఎన్టీఆర్‌కు గట్టిగానే షాకిచ్చింది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఎపిక్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు 140 కోట్లకుపైనే నష్టాలను మిగిల్చినట్లు చెబుతోన్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో ఎన్టీఆర్‌తో పాటు హృతిక్ రోషన్ మరో హీరోగా నటించాడు. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిన ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు.
ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్…
రజనీకాంత్ కూలీ మూవీకి పోటీగా ఆగస్ట్ 14న వార్ 2 థియేటర్లలోకి వచ్చింది. ఎన్టీఆర్ క్రేజ్ కారణంగా తెలుగులో స్ట్రెయిట్ మూవీకి ధీటుగా ఈ సినిమాపై హైప్ ఏర్పడింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ భారీగానే జరిగింది. కానీ ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా ఫస్ట్ డే నుంచే ఈ సినిమాకు దారుణంగా నెగెటివ్ టాక్ రావడం మొదలైంది. కథ లేకుండా కేవలం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇమేజ్‌ను, యాక్షన్ సన్నివేశాలను నమ్ముకొని తెరకెక్కిన మూవీ ఇదంటూ విమర్శలు వచ్చాయి. యాక్షన్ సన్నివేశాలు చాలా వరకు లాజిక్‌లెస్‌గా సాగాయంటూ ట్రోల్స్ వచ్చాయి.
థియేటర్ల నుంచి ఔట్…
ఈ నెగెటివ్ టాక్ ఎఫెక్ట్ వార్ 2 కలెక్షన్స్‌పై గట్టిగానే ప్రభావాన్ని చూపించింది. ఫస్ట్ వీకెండ్ పర్వాలేదనిపించిన ఈ మూవీ ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద పూర్తిగా తేలిపోయింది. రెండు వారాలు కూడా కాకముందే థియేటర్లలో కనిపించకుండాపోయింది. ఓవరాల్‌గా నిర్మాతలకు వార్ 2 మూవీ 140 కోట్లకుపైనే నష్టాలు మిగిల్చినట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Also Read – Vinayaka Chavithi 2025: వినాయక చవితి పూజలో దోసకాయ ఎందుకు పెడతారో తెలుసా?
ఓటీటీ రైట్స్…
దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో ఆదిత్య చోప్రా వార్ 2 సినిమాను నిర్మించారు. ప్రమోషన్స్ కోసం మరో యాభై కోట్ల వరకు మేకర్స్ ఖర్చు చేశారట. ఈ సినిమా డిజిటల్ రైట్స్ 140 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ ద్వారా మేకర్స్‌కు మరో అరవై కోట్ల వరకు రెవెన్యూ దక్కినట్లు చెబుతున్నారు. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా 200 కోట్ల వరకు నిర్మాతలకు గిట్టుబాటు అయ్యింది. థియేట్రికల్ హక్కులతో పాటు 12 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్‌తో మరో 250 కోట్లకుపైనే నిర్మాతలు పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చింది.
తెలుగులో యాభై కోట్ల నష్టాలు…
నిర్మాతల పరంగా వార్ 2 లాభసాటి ప్రాజెక్ట్. కానీ ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం గట్టిగానే నష్టాలు వచ్చినట్లు చెబుతున్నారు. చాలా చోట్ల ఈ మూవీ కనీసం యాభై శాతం మేర కూడా రికవరీ సాధించలేదని అంటున్నారు. తెలుగు థియేట్రికల్ హక్కులను 90 కోట్ల భారీ మొత్తానికి నిర్మాత సూర్యదేవర నాగవంశీ సొంతం చేసుకున్నారు. తెలుగు వెర్షన్ అతి కష్టంగా నలభై కోట్ల వరకు వసూళ్లను దక్కించుకున్నది. నిర్మాతకు యాభై కోట్లకుపైనే నష్టాలను మిగిల్చింది. ఈ నష్టాలను తగ్గించడం కోసం నాగవంశీకి వైఆర్ఎఫ్ సంస్థ ఇరవై కోట్లు వెనక్కి ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
700 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్…
వరల్డ్ వైడ్‌గా దాదాపు 700 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వార్ 2 రిలీజైంది. నెట్ కలెక్షన్స్ పరంగా 310 కోట్ల వరకు వసూళ్లు రాబడితే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారు. కానీ 12 రోజుల్లో ఈ మూవీ 170 కోట్ల వరకు మాత్రమే నెట్ కలెక్షన్స్ రాబట్టింది. డిస్ట్రిబ్యూటర్లకు 140 కోట్ల వరకు నష్టాలను మిగిల్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
Also Read – Aishwarya Lekshmi: ఐశ్వర్య లక్ష్మి మత్తెక్కించే ఎద అందాలు చూశారా?


