War 2: ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 ఇప్పట్లో ఓటీటీలోకి వచ్చే దాఖలాలు కనిపించడం లేదు. సెప్టెంబర్ నెలాఖరున ఈ స్పై యాక్షన్ మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఈ వార్తల్లో నిజం లేదని సమాచారం. దసరా తర్వాతే వార్ 2 మూవీ ఓటీటీలోకి రానున్నట్లు చెబుతోన్నారు.
అక్టోబర్ 9న రిలీజ్…
అక్టోబర్ 9 నుంచి నెటిఫ్లిక్స్‌లో వార్ 2 స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు, హిందీతో పాటు మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్నట్లు చెబుతున్నారు.
థియేటర్లలో డిజాస్టర్‌గా నిలివడంతోనే వార్ 2 నెలలోపే ఓటీటీలోకి రానుందని అన్నారు. వార్ 2కు పోటీగా రిలీజైన కూలీ సెప్టెంబర్ 11న ఓటీటీ విడుదల కావడం ఈ పుకార్లకు బలాన్ని చేకూర్చింది. కానీ బాలీవుడ్ సినిమాలకు సంబంధించి థియేటర్, ఓటీటీ రిలీజ్ మధ్య తప్పనిసరిగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలని నేషనల్ మల్టీప్లెక్స్ రూల్ పెట్టాయి. ఈ రూల్ కారణంగానే వార్ 2 ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతుందని అంటున్నారు.
Also Read – Navaratri 2025: నవరాత్రులకు ముందు ధనవంతులు కాబోయే రాశులు ఏవో తెలుసా?
నాలుగు వందల కోట్ల బడ్జెట్…
వార్ 2 మూవీలో ఎన్టీఆర్‌తో పాటు హృతిక్ రోషన్ హీరోలుగా నటించారు. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా వార్ 2 ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. థియేటర్లలో మూడు వందల కోట్ల వరకు మాత్రమే కలెక్షన్స్ రాబట్టింది.
ఎన్టీఆర్‌కు ఉన్న స్టార్‌డమ్ కారణంగా తెలుగులోనూ వార్ 2 పై స్ట్రెయిట్ సినిమాకు ధీటుగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. వార్ 2లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. అనిల్ కపూర్, అశుతోష్ రాణా కీలక పాత్రలు పోషించారు.
వార్ 2 మూవీలో విక్రమ్ చలపతి అనే స్పెషల్ ఏజెంట్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించాడు. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్, అతడిపై తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం బాగున్నాయనే కామెంట్స్ వచ్చాయి. 2019లో రిలీజైన వార్ మూవీకి సీక్వెల్‌గా వార్ 2 రూపొందింది. ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మించారు. ఆగస్ట్ 14న వార్ 2కు పోటీగా రజనీకాంత్ కూలీ థియేటర్లలో రిలీజైంది. పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీగా అంచనాలు రేకెత్తించిన ఈ రెండు సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి.
Also Read – Dry Prawns Benefits: ఎండు రొయ్యల లాభాలు తెలిస్తే..మటన్ తినడం మానేస్తారు!


