War 2 OTT: ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్సయ్యింది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ గురువారం (నేడు) పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజైంది. హృతిక్ రోషన్ మరో హీరోగా నటించిన ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది.
పాజిటివ్ టాక్…
ప్రీమియర్స్ నుంచే వార్ 2కు పాజిటివ్ టాక్ రావడం మొదలైంది. బాలీవుడ్ డెబ్యూ మూవీలో హృతిక్ రోషన్‌తో పోటీపడి ఎన్టీఆర్ నటించారని అంటున్నారు. యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ తో పాటు ట్విస్ట్‌లు బాగున్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. స్టోరీ విషయంలో మాత్రం విమర్శలు వస్తున్నాయి.
Also Read – Darshan: కన్నడ హీరో దర్శన్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు – అభిమాని హత్య కేసులో బెయిల్ రద్దు
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్…
కాగా వార్ 2 డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అఫీషియల్‌గా కన్ఫామ్ అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా తెలుగు, హిందీ భాషల్లో కలిపి 175 కోట్ల భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. థియేటర్లలో రిలీజైన ఎనిమిది వారాల తర్వాత వార్ 2 ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. దసరా కానుకగా అక్టోబర్‌లో ఈ స్పై యాక్షన్ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
వరల్డ్ వైడ్‌గా 340 కోట్ల వరకు వార్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు ఏడు వందల కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజైంది. తెలుగులో ఎన్టీఆర్ మూవీ లాభాల్లోకి అడుగుపెట్టాలంటే 92 కోట్లకుపైగా కలెక్షన్స్‌ను రాబట్టాల్సివుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ డే ఈ మూవీ 105 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 35 నుంచి నలభై కోట్ల వరకు కలెక్షన్స్ రావచ్చునని అంచనా వేస్తున్నారు.
వార్ 2 కథ ఏంటంటే?
నిజాయితీకి మారు పేరైనా మాజీ రా ఏజెంట్ కబీర్(హృతిక్ రోషన్).. కలి గ్యాంగ్‌తో చేతులు కలుపుతాడు. దేశంలోని ప్రముఖులను హత్య చేస్తుంటాడు. కబీర్‌ను పట్టుకోవడానికి విక్రమ్ చలపతి (ఎన్టీఆర్) నేపథ్యంలో స్పెషల్ టీమ్ రంగంలోకి దిగుతుంది. వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అద్వానీ) తండ్రిని కూడా కబీర్ చంపేస్తాడు. కబీర్‌పై పగతో రగిలిపోతుంది కావ్య. కబీర్ ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు. అతడి గురించి విక్రమ్ ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు? కబీర్‌కు, కావ్యకు ఉన్న సంబంధం ఏమిటన్నదే ఈ మూవీ కథ.
Also Read – Meenakshi Chaudhary: ముచ్చటగా మూడోసారి సంక్రాంతికి పోటీలో మీనాక్షి చౌదరి – ఆశలన్నీ ఆ సినిమాపైనే!


