Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభPawan Kalyan: 'OG' సినిమా ఓటీటీ డేట్ లీక్... నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్స్‌ట్రా సీన్స్!

Pawan Kalyan: ‘OG’ సినిమా ఓటీటీ డేట్ లీక్… నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్స్‌ట్రా సీన్స్!

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ లవర్స్ కోసం ఒక క్రేజీ అప్‌డేట్! థియేటర్లలో హిస్టరీ క్రియేట్ చేసి, పవన్ కెరీర్‌లోనే హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్‌గా నిలిచిన ‘ఓజీ’ (OG – They Call Him OG), ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై విధ్వంసం సృష్టించడానికి రెడీ అవుతోంది.

- Advertisement -

బాక్సాఫీస్ వద్ద ₹300 కోట్లు… ఇక ఓటీటీలో సునామీ!

సుజీత్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ స్టైలిష్ యాక్షన్ డ్రామా, విడుదలైన కొద్ది రోజులకే ప్రపంచవ్యాప్తంగా ₹300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను దాటింది. 2025లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. థియేటర్‌లో పవన్ కళ్యాణ్ ఎనర్జీని మిస్ అయిన వాళ్లకు, మళ్ళీ మళ్ళీ ఆ ‘హంగ్రీ చీతా’ స్వాగ్‌ను చూడాలనుకునే వాళ్లకు ఇది పర్ఫెక్ట్ ఛాన్స్!

ALSO READ: https://teluguprabha.net/cinema-news/mouli-tanuj-prashanth-2-crore-advance-check/

‘ఓజీ’ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ మొత్తానికి దక్కించుకుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఏమిటంటే… ఈ సినిమా అక్టోబర్ 23 నుంచి స్ట్రీమింగ్ కాబోతోందని!
నిజానికి, చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రాలేదు. కానీ, నాలుగు వారాల థియేట్రికల్ రన్ తర్వాత, ఏ క్షణంలోనైనా నెట్‌ఫ్లిక్స్ సర్ప్రైజ్ అప్‌డేట్ ఇవ్వొచ్చు! ఈ సస్పెన్స్, ‘ఓజీ’ పట్ల ఉన్న క్రేజ్‌ను మరింత పెంచుతోంది.

ఓటీటీ వెర్షన్‌లో స్పెషల్ ట్రీట్!

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే ‘ఓజీ’ వెర్షన్‌లో థియేటర్లలో లేని కొన్ని ఎక్స్‌ట్రా సీన్స్‌, ఒక స్పెషల్ సాంగ్ కూడా యాడ్ కానున్నాయట! ఈ అప్‌డేట్ విన్న తర్వాత, పవన్ ఫ్యాన్స్ ఎగ్జైట్‌మెంట్ లెవెల్స్ ఆకాశాన్ని తాకాయనడంలో సందేహం లేదు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/salman-khan-murugadoss-sikandar-fight/

డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాను ఒక స్టైలిష్ విజువల్ ట్రీట్‌గా మలిచాడు. పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లడంలో డౌట్ ఏ లేదు. యాక్షన్, డ్రామా, అద్భుతమైన కెమెరా పనితనం (రవి కె. చంద్రన్), ఎస్.ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్… అన్నీ కలిసి పవర్ స్టార్ ఫాన్స్ కి ఒక పవర్‌ఫుల్ ప్యాకేజీని అందించాయి.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad