Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభOkkadu : 20 ఏళ్ళ తర్వాత.. మహేష్ ఫస్ట్ మాస్ హిట్ రీ రిలీజ్..

Okkadu : 20 ఏళ్ళ తర్వాత.. మహేష్ ఫస్ట్ మాస్ హిట్ రీ రిలీజ్..

- Advertisement -

Okkadu : ఇటీవల పాత సినిమాల రీ రిలీజ్ లు ఎక్కువైనా సంగతి తెలిసిందే. ఎటువంటి పెట్టుబడి లేకుండా ఫ్యాన్స్ కోసం స్టార్ హీరోల సినిమాలని రీ రిలీజ్ చేస్తుంటే డబ్బులు బాగానే వస్తుండటంతో పాత హిట్స్ అన్ని రీ రిలీజ్ చేసే పనిలో పడ్డారు మేకర్స్. మహేష్, పవన్, ఎన్టీఆర్, ప్రభాస్, ధనుష్, చిరంజీవి, రజినికాంత్.. ఇలా స్టార్ హీరోల పాత హిట్స్ అన్ని మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.

మరికొంతమంది హీరోలు కూడా తమ సినిమాలని రీ రిలీజ్ చేయడానికి ప్లాన్స్ వేస్తున్నారు. ఈ రిలీజ్ లపై అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు తన పోకిరి సినిమాని రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రీ రిలీజ్ లో కూడా ఈ సినిమా రికార్డులని సృష్టించింది.

తాజాగా మహేష్ నటించిన మరో సినిమాని రిలీజ్ చేయనున్నారు. మహేష్ కెరీర్ లో మొట్టమొదటిసారి మాస్ హిట్ తెచ్చుకున్న సినిమా ఒక్కడు. 2003 జనవరి 15న అప్పుడు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ హిట్ సాధించి అప్పటి వరకు మహేష్ కెరీర్ లోనే పెద్ద హిట్ కొట్టి కలెక్షన్స్ ని సాధించింది. మహేష్ హీరోగా, భూమిక హీరోయిన్ గా ప్రకాష్ రాజ్ విలన్ గా ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా రిలీజ్ అయి 20 ఏళ్ళు అవుతున్న సందర్భంగా 2023 జనవరి 7న భారీ స్థాయిలో 4కె వర్షన్ లో రీ రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యారు. అలాగే దీనికి కొత్త ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 24న సాయంత్రం 7 గంటలకు ఒక్కడు సినిమా రీ రిలీజ్ ట్రైలర్ కూడా విడుదల చేయనున్నారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News