Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభOTT Releases: ఈ వారం ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలివే! హైలైట్ ఇదే!

OTT Releases: ఈ వారం ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలివే! హైలైట్ ఇదే!

OTT Movies This Week: ఈ వారం ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాల పేర్లు బయటకు వచ్చేశాయి. జూలై 18 అనగా వచ్చే శుక్రవారం నాడు రెండు తెలుగు సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి రానున్నాయి. ఇటీవలే థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘కుబేర’ రిలీజ్ కానుండగా.. రెండో మూవీ ‘భైరవం’. ఈ రెండు చిత్రాలు థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకొని.. ఇప్పుడు ఓటీటీ బాట పట్టాయి. రేపటి నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానున్నాయి.

- Advertisement -

‘కుబేర’ చిత్రాన్ని శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సునీల్ నారంగ్ నిర్మించారు. ఇందులో ధనుష్ బిచ్చగాడి పాత్రలో నటించగా.. హీరోయిన్ గా రష్మిక తెరపై కనిపించారు. ఈ మూవీలో కింగ్ నాగార్జున కీలకపాత్ర పోషించారు. జిమ్ సర్బ్ ప్రతినాయకుడిగా టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు.

అయితే ఈ చిత్రంతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల కొత్త పాయింట్‌ని టచ్ చేశారని విమర్శకులు ప్రశంసలు కురిపించారు. కింగ్ నాగార్జున లాంటి వారితో ఒక డిఫరెంట్ రోల్ చేయించి మంచి మార్కులు కొట్టేశాడు. దేవీశ్రీప్రసాద్ సంగీతం ఆకట్టుకుంది. హీరోయిన్ గా రష్మిక న్యాయం చేసింది. ఆడియన్స్ కు కథ కొత్తగా ఉండడంతో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. శుక్రవారం నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఇదే వారం ‘జీ 5’లో ‘భైరవం’ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ప్రధాన పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ .. మంచు మనోజ్ .. నారా రోహిత్ ఆకట్టుకున్నారు. వీరితో పాటు అదితి శంకర్.. ఆనంది.. దివ్యపిళ్లై నటించి మెప్పించారు. డైరెక్టర్ విజయ్ కనకమేడల రూపొందించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల బాణీలు సమకూర్చారు. మే 30వ ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. రేపటి నుంచి ‘జీ 5’ యాప్‌లో అందుబాటులోకి రానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad