Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభPathan: పఠాన్ లో 10 కట్స్.. 'బేషర్మ్ రంగ్' సాంగ్ లోనూ హాట్ షాట్స్ కట్

Pathan: పఠాన్ లో 10 కట్స్.. ‘బేషర్మ్ రంగ్’ సాంగ్ లోనూ హాట్ షాట్స్ కట్

పఠాన్ సినిమాలోని హాట్ సీన్స్ లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) కట్ చేయాలని ఆదేశించింది. దీంతో CBFCరూల్ బుక్ ప్రకారం .. దీపికను క్లోజ్ అప్ లో అశ్లీలంగా చూపించిన హాట్ సీన్స్ కట్ అవ్వనున్నాయి. కనీసం 10 సీన్లు కత్తిరిస్తే తప్ప సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు లేవని బోర్డు తేల్చి చెప్పింది. ఈ పది సీన్లలో డైలాగులు కూడా ఉండటం విశేషం. “రా, లంగ్డే లుల్లే, పీఎంఓ, ఎక్స్ కేజీబీ, అశోక చక్ర, మిస్టర్స్ భారత్ మాత, ఇస్సే సస్తీ స్కాచ్ నహి మిలి” డైలాగుల స్థానంలో వేరేవి చేర్చక తప్పలేదు. పార్షియల్ న్యూడిటీ కారణంగా బేషరం రంగ్ పాటలో మూడు మార్పులు చేశారు. యష్ రాజ్ ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్, దీపికా పదుకున్, జాన్ అబ్రహం ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న పఠాన్ సినిమాలో భాయీ జాన్ సల్మాన్ ఖాన్ క్యామియో రోల్ ప్లే చేస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో వస్తున్న పఠాన్ మొత్తం డ్యూరేషన్ 146 నిమిషాలు అంటే 2 గంటల 26 నిమిషాలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News