Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభPawan Kalyan: సినీ ఇండస్ట్రీలో ప్రతిభే ముఖ్యం.. నా కొడుకైనా అంతే : పవన్ కళ్యాణ్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీలో ప్రతిభే ముఖ్యం.. నా కొడుకైనా అంతే : పవన్ కళ్యాణ్

Hari Hara Veera Mallu Press Meet: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘హరిహర వీరమల్లు’. జూలై 24న (HHVM Release Date) సినిమా రిలీజ్ కానుంది. జ్యోతికృష్ణ (Jyothi Krishna) దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ… పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ‘‘నేను సాధారణంగా నా సినిమాల గురించి మాట్లాడను. అయితే ఈ సినిమా గురించి మాట్లాడాలనుకోవటానికి కారణం.. నిర్మాత ఎ.ఎం.రత్నంగారు. చిన్న మేకప్ మ్యాన్ నుంచి ప్రారంభమైన ఆయన కెరీర్, రీజనల్ సినిమాను నేషనల్ రేంజ్‌కు తీసుకెళ్లేంతగా మారింది. హరిహర వీరమల్లు విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఆయన నిలబడిన తీరు నాకెంతో నచ్చింది. ఈ సినిమా కోసం ఎంతగానో నలిగిపోయారు. చిన్న కుర్చిని తయారు చేయటానికి పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఓ సినిమా తీయాలంటే ఎన్ని యుద్ధాలో చేయాలో ఆలోచించాలి. ఇండస్ట్రీ బాగు కోరేవాళ్లకు అండగా నిలబడటం చాలా ముఖ్యం. అందుకనే ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నా నేను ఈ ప్రెస్ మీట్‌కు వచ్చాను.

- Advertisement -

హరిహర వీరమల్లు కథతో క్రిష్ (Krish Jagarlamudi), రత్నం (AM Ratnam) నా దగ్గరకు వచ్చినప్పుడు నేను నా బెస్ట్ ఇవ్వటానికే ప్రయత్నించాను. ఇది కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగే కథ. ముందుగా అనుకున్నప్పుడు ఒక భాగంగా చేయగలుగుతామా అనుకున్నాను. క్రిష్ చాలా మంచి ఆలోచనతో వచ్చారు. అయితే ఆయన వ్యక్తిగత కారణాలు, క్రియేటివ్ కారణాలతో ఆయన వెళ్లిపోయారు. అప్పుడు జ్యోతి కృష్ణ ఎంట్రీ ఇచ్చారు. నేను గతంలో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ విద్యలు ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు ఎంతో పనికొచ్చాయి. సినీ ఇండస్ట్రీకి కుల మత బేదాలుండవు. ఇక ప్రతిభే ముఖ్యం. చిరంజీవి (Chiranjeevi) తమ్ముడైనా, కొడుకైనా, మేనల్లుడైనా ఎవరైనా టాలెంటే ముఖ్యం రేపు నా కొడుకైనా అంతే.

Also Read – USA: గ్రీన్ కార్డ్ కు జాప్యం.. ట్రంప్ సర్కార్ లో రికార్డ్

డైరెక్టర్ జ్యోతి కృష్ణ చాలా టాలెంటెడ్ ఉన్న వ్యక్తి. మూవీ షూటింగ్ చేసే సమయంలో ప్రతి సన్నివేశానికి సంబంధించి ప్రీ విజువలైజ్ వీడియో చూపించేవాడు. తన ప్లానింగ్ ఎంతో నచ్చింది. అందుకనే ప్రతిరోజూ రెండు గంటలకు నిద్ర లేచేవాడిని. వ్యాయామం చేసే సమయాన్ని కాస్త మార్చుకుని బ్రేక్ ఫాస్ట్ సమయంలో రెండు గంటలు మాత్రమే సమయం ఇచ్చేవాడిని. ఆ సమయంలోనే అనుకున్న ప్రణాళికి ప్రకారం మూవీని పూర్తి చేశాం. సినీ ఇండస్ట్రీని టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ అని వేరు చేయటం నాకు ఇష్టం లేదు.. నచ్చదు’’ అన్నారు.

Also Read – Dowry suicide: వరకట్న వేధింపులు: కూతురు కళ్లెదుటే ఉరేసుకుని తల్లి ఆత్మహత్య..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad