Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభOg Sucess Meet: ఓజీ గ్రాండ్ స‌క్సెస్ మీట్‌... ఎప్పుడు... ఎక్క‌డంటే? - ప‌వ‌న్ క‌ళ్యాణ్...

Og Sucess Meet: ఓజీ గ్రాండ్ స‌క్సెస్ మీట్‌… ఎప్పుడు… ఎక్క‌డంటే? – ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌స్తున్నాడు!

Og Sucess Meet: ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొడుతోంది. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్‌సీస్‌లో ఓజీ మేనియాతో థియేట‌ర్లు మొత్తం ఊగిపోతున్నాయి. రెండు రోజుల్లోనే రెండు వంద‌ల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకొని ఓజీ కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఓవ‌ర్‌సీస్‌లో యాభై కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌తో దుమ్మురేపింది. ఫ‌స్ట్ వీకెండ్ పూర్త‌య్యేలోపు అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీగా ఓజీ నిలిచింది. ప‌వ‌ర్ స్టార్ కెరీర్‌లో వంద కోట్ల షేర్ సాధించిన తొలి సినిమా కూడా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.
ద‌స‌రా త‌ర్వాత కూడా ఓజీ జోరు కొన‌సాగేలా ఉంది. ఫుల్ థియేట్రిక‌ల్ ర‌న్‌లో ఈ మూవీ ఐదు వంద‌ల కోట్ల‌కుపైనే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఓజీకి వ‌స్తున్న రెస్పాన్స్‌తో మేక‌ర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

- Advertisement -

గ్రాండ్ స‌క్సెస్ మీట్‌…
ఓజీ విజ‌యాన్ని అభిమానుల‌తో పంచుకోవ‌డానికి గ్రాండ్ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ పేరుతో ఓ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్‌. అక్టోబ‌ర్ 1న హైద‌రాబాద్‌లో ఈ గ్రాండ్ స‌క్సెస్ మీట్ జ‌రుగ‌నుంది. ఈ ఈవెంట్‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా వ‌స్తున్నాడ‌ట‌. హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో స‌క్సెస్ మీట్‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిసింది.

Also Read – E-KYC is Compulsory: కొత్త రేషన్‌ కార్డుదారులకు ముఖ్య గమనిక.. ఈ–కేవైసీ తప్పనిసరి!

స్పెష‌ల్ గెస్ట్‌లు…
ప‌వ‌న్ హెల్త్ కండీష‌న్‌ను బ‌ట్టి ఇవాళ లేదంటే రేపు గ్రాండ్ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌కు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు తెలిసింది. ఈ ఈవెంట్ కోసం మేక‌ర్స్ భారీగా ప్లాన్స్ చేస్తున్నార‌ట‌. టీమ్‌తో పాటు స్పెష‌ల్ గెస్ట్‌లు కూడా వేడుక‌కు వ‌స్తార‌ని టాక్ వినిపిస్తుంది. వాళ్లు ఎవ‌ర‌న్న‌ది కూడా ఒక‌టి, రెండు రోజుల్లో క‌న్ఫామ్ కానుంది.

స‌క్సెస్ మీట్‌కు ప‌వ‌న్‌…
గ‌త నాలుగైదు రోజులుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైర‌ల్ ఫీవ‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారు. జ్వ‌రం తీవ్ర‌త పెర‌గ‌డంతో హైద‌రాబాద్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఈ నెలాఖ‌రులోపు కోలుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది. స‌క్సెస్ మీట్‌కు త‌ప్ప‌కుండా అటెండ్ అవుతార‌ని మేక‌ర్స్ చెబుతున్నారు.

సాహో రిఫ‌రెన్స్‌…
ఓజీ మూవీకి సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలివేష‌న్లు, హీరోయిజం, డైలాగ్స్ ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. జానీ, త‌మ్ముడుతో పాటు ప్ర‌భాస్ సాహో రిఫ‌రెన్స్‌ల‌ను ఓజీలో సుజీత్ వాడిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కంప్లీట్ ప‌వ‌న్ ఇమేజ్‌ను న‌మ్ముకొని సుజీత్ ఈ సినిమాను రూపొందించారు.

ఓజీ మూవీలో ప్రియాంక అరుళ్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టించ‌గా… బాలీవుడ్ న‌టుడు ఇమ్రాన్ హ‌ష్మీ విల‌న్‌గా క‌నిపించాడు. ప్ర‌కాష్ రాజ్‌, అర్జున్ దాస్‌, శ్రియారెడ్డి కీల‌క పాత్ర‌లు పోషించారు. త‌మ‌న్ బీజీఎమ్ ఓజీకి హైలైట్‌గా నిలుస్తోంది. ఓజీకి సీక్వెల్ తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Also Read – Navratri 2025: నవరాత్రుల్లో బెంగాలీలు మాంసాహారం ఎందుకు తింటారో తెలుసా?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad