OG Ott: పవన్ కళ్యాణ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ఓజీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ మూవీ అక్టోబర్ 23న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతుంది. ఓజీ స్ట్రీమింగ్ డేట్‌ను శనివారం నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
గ్యాంగ్‌స్టర్ యాక్షన్‌గా తెరకెక్కిన ఓజీకి సుజీత్ దర్శకత్వం వహించాడు. మాళవికా అరుళ్ మెహన్ హీరోయిన్‌గా నటించింది. ఓజీతో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. భారీ అంచనాలతో నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను తిరగరాసింది. మూడు వందల కోట్ల వసూళ్లతో ఈ ఏడాది తెలుగులో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న సినిమాగా నిలిచింది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రిలీజ్‌ముందు ఓజీ ఐదు వందల కోట్ల వసూళ్లను దాటుతుందని ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ హీరోయిజం, ఎలివేషన్లు బాగున్నా కథలో కొత్తదనం లేకపోవడంతో అంచనాలను తగ్గట్లుగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఫుల్ థియేట్రికల్ రన్‌లో నిర్మాతలకు ఈ మూవీ ఐదు కోట్ల వరకు మాత్రమే లాభాలను తెచ్చిపెట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. అయితే ఓటీటీ, శాటిలైట్‌తో పాటు మ్యూజిక్ రైట్స్ కలిపి ప్రొడ్యూసర్‌కు గట్టిగానే మిగిలినట్లు సమాచారం.
Also Read – Bangladesh vs West Indies: ఒత్తిడిలో బంగ్లా జట్టు, స్పిన్నర్లకు అనుకూల పిచ్..!
ఓజస్ గంభీర పాత్రలో…
ఓజీ మూవీలో ఓజస్ గంభీర అనే పాత్రలో పవన్ కళ్యాణ్ అభిమానులను ఆకట్టుకున్నాడు. కథ కంటే పవన్ కళ్యాణ్‌ను స్టైలిష్‌గా చూపించడం, ఎలివేషన్లకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ సుజీత్ ఈ మూవీని రూపొందించాడు. ఓజీ మూవీకి సీక్వెల్ రాబోతుంది. ఓజీ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. తమన్ మ్యూజిక్ అందించాడు.
ఓజీ తర్వాత పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర తాలూకు షూటింగ్ పూర్తయ్యింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్‌లో రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Also Read – K- Ramp: కిరణ్ అబ్బవరం డబుల్ మీనింగ్ డైలాగ్స్, SKN జవాబులు!


