Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్‌ను జెట్ స్పీడ్‌లో పూర్తిచేస్తున్నారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఏంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు పేర్కొన్నారు. సెట్స్‌లో పవన్ కళ్యాణ్‌కు డైరెక్టర్ హరీష్ శంకర్ సీన్ వివరిస్తున్న ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో స్టైలిష్ లుక్‌లో పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్…
స్టంట్ కొరియోగ్రాఫర్ నబాకాంత మాస్టర్ సారథ్యంలో క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించినట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. హై ఎమోషన్స్‌తో సాగే ఈ యాక్షన్ ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుందని తెలిపింది. ఏపీ డిప్యూటీ సీఏంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే క్యాబినెట్ సమావేశాలకు హాజరవుతూ.. హరిహర వీరమల్లు ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటూ మరోవైపు, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌ను పవన్ కళ్యాణ్ శరవేగంగా కంప్లీట్ చేశారు. పవన్ కళ్యాణ్ అంకితభావానికి ఇది నిదర్శనం అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్‌లో పేర్కొన్నది. ఈ యాక్షన్ ఎపిసోడ్‌లో పవన్ కళ్యాణ్ స్టంట్స్, ఆయన మ్యానరిజమ్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నట్లు సమాచారం. ఈ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌తో ఉస్తాద్ భగత్‌సింగ్‌లో పవన్ కళ్యాణ్ పోర్షన్‌కు సంబంధించి షూటింగ్ దాదాపు పూర్తయినట్లు సమాచారం.
Also Read- Spirit Movie: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ – స్పిరిట్ గురించి ఈ విషయం తెలుసా?
గబ్బర్ సింగ్ తర్వాత…
గబ్బర్‌సింగ్ బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ తెరకెక్కుతోంది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పార్థిబన్, కె.ఎస్. రవికుమార్, రాంకీ, నవాబ్ షా కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఓ వైపు షూటింగ్‌ను జరుపుతూనే మ్యూజిక్ సిట్టింగ్స్ కొనసాగిస్తున్నారు.
నష్టాల దిశగా…
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. క్రిష్, ఏఎమ్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. నాలుగు రోజుల్లో వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
ఓజీ సెప్టెంబర్‌లో రిలీజ్…
ఇటీవలే ఓజీ సినిమా షూటింగ్‌ను పూర్తిచేశారు పవన్ కళ్యాణ్. సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా కనిపించబోతున్నది.


