Friday, April 4, 2025
Homeచిత్ర ప్రభAllu Arjun: అల్లు అర్జున్‌పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

Allu Arjun: అల్లు అర్జున్‌పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

Allu Arjun| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై గ్రీన్ పీస్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ ఫౌండేషన్‌ సంస్థ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ గౌడ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన అభిమాన సంఘానికి అల్లు ఆర్మీ అని పేరు పెట్టుకోవడంపై అభ్యంతరం తెలిపాడు. ‘ఆర్మీ’ అనే పదం దేశానికి సేవ చేసే గౌరవప్రదమైన పేరు అని, దీనిని తన అభిమాన సంఘానికి పెట్టుకోవడంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

- Advertisement -

కాగా ఇటీవల బీహార్‌లో నిర్వహించిన ‘పుష్ప-2’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ తన అభిమానులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరి హీరోలకు అభిమానులు ఉంటారని, తనకు మాత్రం ఆర్మీ ఉందని చెప్పుకొచ్చారు. దీంతో బన్నీ వ్యాఖ్యలు నెట్టింట విమర్శలకు దారితీశాయి. దేశానికి సేవ చేసే ఆర్మీ పదాన్ని ఇలా దుర్వినియోగం చేయడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే పుష్ప-2 మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిచారు. ఇక క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మూవీకి దర్శకత్వం వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News