Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభPooja Hegde: రీ ఎంట్రీ అయినా.. తగ్గేదే లే అంటున్న బుట్టబొమ్మ..!

Pooja Hegde: రీ ఎంట్రీ అయినా.. తగ్గేదే లే అంటున్న బుట్టబొమ్మ..!

Pooja Hegde: పూజా హెగ్డేకి తెలుగులో అవకాశాలు వచ్చి దాదాపు రెండేళ్ళు దాటిపోయింది. రాధే శ్యామ్, ఆచార్య సినిమాల తర్వాత మళ్ళీ కనిపించలేదు. బాలీవుడ్‌లో ఆశలు పెట్టుకుంటే అక్కడ కూడా ఈ బుట్టబొమ్మకి నిరాశ తప్పలేదు. కొంత గ్యాప్ తర్వాత కోలీవుడ్ లో సూర్య నటించిన రెట్రోతో పలకరించింది. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ప్రస్తుతం తమిళంలోనే విజయ్ నటిస్తున్న జన నాయగన్ సినిమాలో హీరోయిన్‌గా సందడి చేయబోతోంది. అయితే, తాజా సమాచారం మేరకు తెలుగులో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతుందట.

- Advertisement -

దుల్కర్ సల్మాన్ కి తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్న దుల్కర్ ఇక్కడ స్ట్రైట్ మూవీస్ చేస్తూ మన టాలీవుడ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం దుల్కర్ తెలుగులో రవి నేలకుడితి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుగుతోంది. ఇప్పుడు ఇదే సినిమాతో పూజా హెగ్డే మళ్ళీ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తోంది.

Also Read- Mahesh Babu: హైద‌రాబాద్‌లో మ‌హేష్‌బాబు మ‌రో మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ – చిరంజీవి సినిమాతో ఓపెనింగ్‌

రెట్రో తర్వాత తెలుగులో రెండు సినిమాలు కమిటైందని, ఆ రెండు సినిమాలు కూడా అగ్ర దర్శకుడు తెరకెక్కించేవని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పటి వరకూ ఆ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన అప్‌డేట్స్ ఏవీ రాలేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలి సినిమాలో మాత్రం స్పెషల్ నంబర్ లో కనిపించి ఆకట్టుకుంది. మోనికా అంటూ పూజా ఒంపుసొంపులతో ఊపేసిన ఈ సాంగ్ ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. అయితే, ఇప్పుడు తెలుగు సినిమా కోసం పూజా అందుకుంటున్న రెమ్యునరేషన్ చర్చనీయంశంగా మారింది.

వాస్తవానికి ఈ బుట్టబొమ్మ టాలీవుడ్ కి దూరం కావడానికి ఉన్న కారణాలలో రెమ్యునరేషన్ కూడా ఒకటి. బాగా ఎక్కువగా డిమాండ్ చేస్తుందనే మేకర్స్ పక్కన పెట్టారు. అదే సమయంలో పూజాకి వరుస ఫ్లాప్స్, శ్రీలీల ఎంట్రీ, పాన్ ఇండియా రేంజ్ లో రష్మిక పాపులర్ కావడం.. ఇలా చాలా దెబ్బకొట్టాయి. అయినా, ఇప్పుడు టాలీవుడ్ రీ ఎంట్రీ మూవీ కోసం రూ.3 కోట్ల వరకూ డిమాండ్ చేస్తుందట. గతంలోనూ పూజా ఒక్కో సినిమాకి 3 నుంచి 5 కోట్ల వరకూ రెమ్యునరేషన్ అందుకుంది. అది బాగా ఎక్కువనే మన మేకర్స్ పక్కన పెట్టారట. ఇక ఇప్పుడు కూడా తన రెమ్యునరేషన్ 3 కోట్ల కంటే తక్కువేమీ కాదని తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే ఏ రకంగానూ పూజా డిమాండ్ తగ్గలేదని అర్థమవుతోంది.

Also Read- Rowdy Janrdhan: ఫ్లాప్ ప్రొడ్యూస‌ర్‌తో మ‌ళ్లీ విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా.. డేట్ ఫిక్స్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad