The Rajasaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను ప్రకటిస్తూనే ఉన్నారు. అలాగే, ఇతర హీరోల చిత్రాలలోనూ గెస్ట్ అప్పిరియెన్స్ ఇస్తూ అభిమానులను అలరిస్తున్నారు. దీనికి ఉదాహరణ మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన కన్నప్ప. అంతేకాదు, కొన్ని సినిమాలకు తన వాయిస్ ని కూడా అందిస్తున్నారు. ఇక ప్రభాస్ చేతిలో ఇప్పుడు 6 ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో మొదటిది ‘ది రాజా సాబ్’. డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
రాజాసాబ్ సినిమాను డిసెంబర్ 5వ తేదీన విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ మూవీ నుండి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో పలు సందేహాలను రేకెత్తించిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ అసలు బాగోలేదని సోషల్ మీడియాలో చాలామంది కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని కీలక సన్నివేశాలను మళ్ళీ రీ షూట్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే, రాజాసాబ్ సినిమాని కూడా వచ్చే ఏడాది జనవరి 9కి విడుదల వాయిదా వేశారు. ఇక తాజా సమాచారం మేరకు ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్ కోసం దర్శకుడు మారుతి ఒక ర్యాపర్ సింగర్ ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.
Also Read – Bigg boss Today promo: నడుము గిల్లద్దు.. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్.. హీరోయిన్ పై కమెడియన్ కంప్లైంట్
ది రాజాసాబ్ మూవీలో ప్రభాస్ ని వింటేజ్ లుక్ లో చూపించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్, ట్రైలర్ లో కూడా ప్రభాస్ మేకోవర్ ని చూసి అందరూ ఫ్రీజ్ అయ్యారు. ప్రభాస్ ను నెక్స్ట్ లెవల్ లో హైలెట్ అయ్యేలా మారుతి ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ని ప్లాన్ చేశారట. ఈ సాంగ్ కోసం ప్రముఖ రాపర్ సింగర్ హనుమాన్ కింద్ (సూరజ్ చెరుకట్) తో ఈ సాంగ్ ని పాడించినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ ని ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
కాగా, 2026 జనవరి 9న పలు భాషలలో రాజాసాబ్ విడుదలకి సిద్ధమవుతోంది. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ తమన్ సంగీతమందిస్తున్నా ఇందులో.. హీరోయిన్స్ గా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దీ కుమార్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రభాస్ కి తాత పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ ప్రభాస్ నటిస్తున్న ఫస్ట్ హారర్ కామెడీ జానర్ కావడం విశేషం. ఇక ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా తెరకెక్కుతోంది. ఆ తరువాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2 సెట్స్ మీదకి రావాల్సి ఉంది.
Also Read – Donald Trump: కొరియా దెబ్బకు ట్రంప్ యూటర్న్.. విదేశీ ఉద్యోగులను నియమించుకోవాలంటూ పోస్ట్


