Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభPrabhas: ప్రభాస్ వచ్చే ఐదేళ్లలో ఏడు సినిమాలతో ఫుల్ బిజీ.. ఏంటి ఆ సినిమాలు!

Prabhas: ప్రభాస్ వచ్చే ఐదేళ్లలో ఏడు సినిమాలతో ఫుల్ బిజీ.. ఏంటి ఆ సినిమాలు!

Prabhas: మన డార్లింగ్ ప్రభాస్.. ఇప్పుడు ఏకంగా ఏడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలన్నీ రాబోయే ఐదేళ్లలో వస్తాయి. 2030 వరకు ప్రభాస్ ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా షూటింగ్స్ లో పాల్గొనబోతున్నాడు. ఆ ఏడు సినిమాలు ఏంటి, డైరెక్టర్స్ ఎవరు!

- Advertisement -

ప్రస్తుతం ప్రభాస్ ఫోకస్ అంతా రెండు సినిమాలపై ఉంది. అందులో మొదటిది… మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజా సాబ్’. ఇది రొటీన్ యాక్షన్ సినిమా కాకుండా, ఒక ఫుల్ లెంగ్త్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్. చాలా రోజుల తర్వాత ప్రభాస్ కామెడీ టైమింగ్‌తో కూడిన పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్స్ కూడా ఉండగా, ఫస్ట్ పార్ట్ జనవరి 2026 సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది.

రెండోది, ‘సీతారామం’తో అందరి మనసులను దోచుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ‘ఫౌజీ’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామాలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో నటిస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్ ఆగస్టు 2026లో విడుదల కావాలని భావిస్తున్నారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/top-tollywood-stars-attends-bandla-ganesh-diwali-party/

ఇక, త్వరలో మొదలుకాబోయే ప్రాజెక్టుల గురించి చెప్పాలంటే, వాటి అంచనాలే వేరే లెవల్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమా. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి చిత్రాల తర్వాత వంగా మార్క్ ఇంటెన్స్ యాక్షన్, ప్రభాస్ లాంటి భారీ హీరోతో కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవ్వడం ఖాయం. ఇందులో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు.

వీటితో పాటు, బ్లాక్ బస్టర్ సీక్వెల్స్ కూడా లైన్‌లో ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్’ సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. దాని రెండో భాగం ‘సలార్ 2: శౌర్యాంగ పర్వం’ కోసం యావత్ సినీ ప్రపంచం ఎదురుచూస్తోంది. ఈ భాగంలోనే ఖాన్సార్ సామ్రాజ్యానికి రాజు ఎవరో, దేవ, వరదరాజ మన్నార్ మధ్య జరిగే తుది పోరాటం ఎలా ఉంటుందో తెలుస్తుంది. అలాగే, నాగ్‌ అశ్విన్ ‘కల్కి 2898 AD’ ఫస్ట్ పార్ట్ తర్వాత, దాని కథను కొనసాగించేలా పార్ట్ 2 కూడా రానుంది. ఈ సైన్స్ ఫిక్షన్, మైథలాజికల్ యూనివర్స్ ఎంత పెద్దదో, దాని ముగింపు ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ రెండో భాగంలోనే ప్రేక్షకులకు అర్థమవుతుంది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/mamitha-baiju-golden-time-vijay-surya-films/

ఇకపోతే, ప్రభాస్ మరో ఇద్దరు దర్శకులతో సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నారు. ‘పుష్ప’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సుకుమార్ తో కలిసి ప్రభాస్ చేయబోయే సినిమా ఒక రేంజ్ లో ఉండబోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది. దీనిని దిల్ రాజు నిర్మించే అవకాశం ఉంది. ఈ కాంబో అనౌన్స్‌మెంట్ కోసం అభిమానులు ఆత్రుతగా ఉన్నారు.

చివరగా, ‘హనుమాన్’తో అద్భుతం సృష్టించిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మతో కలిసి ప్రభాస్ ఒక పాన్-ఇండియా ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను హోంబళే ఫిలిమ్స్ లాంటి పెద్ద బ్యానర్ నిర్మించబోతోంది అని తెలుస్తుంది. మొత్తంగా చూస్తే, రాబోయే సంవత్సరాల్లో ప్రభాస్ వైవిధ్యమైన పాత్రలు, భారీ బడ్జెట్‌లతో మనందరినీ అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ ఏడు ప్రాజెక్టులు ఇండియన్ సినిమా హిస్టరీలోనే కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అనిపిస్తుంది!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad