Pragya Jaiswal: టాలీవుడ్‌లో హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనులది మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. బాలకృష్ణ కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలుగా నిలిచాయి. అఖండ 2తో డబుల్ హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్నారు. అఖండ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మైథలాజికల్ టచ్‌తో సాగే ఈ యాక్షన్ మూవీలో సంయుక్త మీనన్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలకృష్ణతో సంయుక్త మీనన్‌కు ఇదే ఫస్ట్ మూవీ కాగా… ప్రగ్యా జైస్వాల్ మాత్రం మూడోసారి బాలయ్యతో జోడీ కడుతోంది.
Also Read- Jennifer Mistry : గదిలోకి రమ్మన్నాడు… నిర్మాత బండారం బయటపెట్టిన ప్రముఖ నటి!
సెంటిమెంట్ కంటిన్యూ…
అఖండ పార్ట్ వన్‌లో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నాయికగా కనిపించింది. ఈ మూవీ హిట్టవ్వడంతో డాకు మహారాజ్‌లోనూ జోడీని రిపీట్ చేశారు. ఈ సెంటిమెంట్‌ను అఖండ 2తో కంటిన్యూ చేస్తున్నారు. ఈ సీక్వెల్‌తో రీసెంట్ టైమ్‌లో నయనతార తర్వాత బాలకృష్ణతో వరుసగా మూడు సినిమాలు చేసిన హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్ నిలిచింది.
బోయపాటి శ్రీను సినిమాల ద్వారానే…
కాకతాళీయంగా ఈ ఇద్దరు హీరోయిన్లు బోయపాటి శ్రీను సినిమాల ద్వారానే బాలకృష్ణతో ఫస్ట్ టైమ్ జోడీ కట్టారు. సింహా సినిమాతో మొదటిసారి బాలయ్యతో స్క్రీన్‌షేర్ చేసుకుంది నయనతార. అఖండలో తొలిసారి బాలయ్యతో రొమాన్స్ చేసిన ప్రగ్యా జైస్వాల్.
Also Read- Keerthy Suresh: అందాలతో కేక పెట్టిస్తున్న మహానటి, పిక్స్ వైరల్
మూడు హిట్లు…
సింహా తర్వాత బాలకృష్ణ, నయనతార కలయికలో శ్రీరామరాజ్యం, జై సింహా సినిమాలు వచ్చాయి. ఈ మూడు కమర్షియల్ హిట్స్‌గా నిలిచాయి. సేమ్ నయన్‌లాగే బాలకృష్ణతో ప్రగ్యా జైస్వాల్ చేసిన అఖండ, డాకు మహారాజ్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. అఖండ 2తో సక్సెస్ అందుకొని నయనతార తర్వాత బాలకృష్ణతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన హీరోయిన్‌గా నిలవాలని ప్రగ్యా జైస్వాల్ ఎదురుచూస్తోంది. ఈ బోల్డ్ బ్యూటీ కల తీరుతుందో, లేదో అన్నది సెప్టెంబర్ 25 తర్వాతే తేలనుంది.
యాక్షన్ ఫీస్ట్
అఖండ 2పై ఉన్న బజ్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద గట్టిగానే ఈ మూవీ జోరు చూపించేలా కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌తో యాక్షన్ ఫీస్ట్‌లా అఖండ 2 ఉంటుందని అభిమానులకు హింట్ ఇచ్చేశారు బోయపాటి. కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌తో పాటు బాలకృష్ణ బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లు అఖండ 2కు ప్లస్ కాబోతున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అఖండ2లో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


