Friday, November 22, 2024
Homeచిత్ర ప్రభChiranjeevi-Pawan: చిరుకి ప్రతిష్టాత్మక అవార్డ్.. తమ్ముడు పవన్ రియాక్షన్ ఇదే!

Chiranjeevi-Pawan: చిరుకి ప్రతిష్టాత్మక అవార్డ్.. తమ్ముడు పవన్ రియాక్షన్ ఇదే!

- Advertisement -

Chiranjeevi-Pawan: ఒకవైపు రీమేక్ సినిమాలు.. మరోవైపు స్ట్రైట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. రాబోయే వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి విడుదల ప్లాన్ చేస్తుండగా.. భోళా శంకర్ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ రాజా రవితేజ కీలక పాత్రలో కనిపిస్తుండగా అభిమానులలో భారీ అంచనాలున్నాయి. ఇక భోళా శంకర్‌ సినిమా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

సినిమాల సంగతి పక్కన పెడితే.. చిరుకి ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు దక్కగా.. ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ప్రతిష్టాత్మకంగా అందించే ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఈ సంవత్సరం మెగాస్టార్ కి అందించనున్నట్లు ప్రకటించారు. IFFI ప్రారంభోత్సవ వేదికపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఈ అవార్డును ప్రకటించారు.

ప్రతిష్టాత్మకమైన అవార్డుకు ఎంపికైన చిరుకి పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతుండగా.. అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా అన్నయ్యకి అవార్డుపై తమ్ముడు పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశాడు. తెలుగు చలన చిత్రసీమలో శిఖర సమానులు, అన్నయ్య శ్రీ చిరంజీవి గారిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ – 2022 పురస్కారం వరించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో భాగంగా భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రం.

ఈ ఆనంద సమయంలో నా మార్గదర్శి అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. నాలుగు దశాబ్దాలు పైబడిన అన్నయ్య సినీ ప్రస్థానం, తనను తాను మలచుకొని ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకోవడం నాతో సహా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. అంతర్జాతీయ చలన చిత్ర వేదికపై అన్నయ్య చిరంజీవి గారికి ఈ గౌరవం దక్కుతున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.

కాగా, 2013లో భారతీయ సినిమా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ అవార్డును అందించడం ప్రారంభించగా.. భారతీయ సినిమా అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రముఖులకు ఈ అవార్డ్ ఇవ్వబడుతుంది. చిరు కంటే ముందు మొదటి సారిగా వహీదా రెహమాన్ అవార్డు అందుకోగా.. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, సలీం ఖాన్, బిశ్వజిత్ ఛటర్జీ, ప్రసూన్ జోషి, రజనీకాంత్, హేమమాలిని, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ అవార్డు అందుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News