Mitramandali: పెద్దలు ఊరికే చెప్పలేదు, “చెయ్యి జారితే తీసుకోవచ్చు, కానీ నోరు జారితే తీసుకోలేము” అని. ఇప్పుడు కమెడియన్ నుండి హీరోగా మారిన ప్రియదర్శి పరిస్థితి సరిగ్గా అలాగే తయారైంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన తన సినిమా ‘మిత్రమండలి’ విషయంలో ఆయన ఇచ్చిన కాన్ఫిడెంట్ స్టేట్‌మెంట్, ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ట్రోలింగ్‌కు దారితీసింది.
ప్రియదర్శి ఏం మాట్లాడాడు?
‘మిత్రమండలి’ సినిమా ప్రమోషన్స్ టైంలో ప్రియదర్శి చాలా ధైర్యంగా ఒక మాట అన్నారు:
“ఒకవేళ ఈ సినిమా (మిత్రమండలి) మీకు నచ్చకపోతే, మీ డబ్బు వృథా అయ్యిందనిపిస్తే… దయచేసి నా నెక్స్ట్ సినిమా చూడకండి.”
ALSO READ: https://teluguprabha.net/cinema-news/kiran-abbavaram-double-meaning-dialogues-skn-response/
ఆ స్టేట్‌మెంట్ వెనుక ఎవరున్నారు?
ఈ డైలాగ్ వినగానే చాలా మందికి, హీరో నాని గుర్తొచ్చారు. ఎందుకంటే, ప్రియదర్శి కంటే ముందు, నేచురల్ స్టార్ నాని కూడా సరిగ్గా ఇలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చారు.
నాని స్టైల్ లో తన సూపర్ హిట్ సినిమా ‘కోర్ట్’ ప్రమోషన్స్ టైంలో, “ఈ సినిమా మీకు నచ్చకపోతే, దీని తర్వాత వచ్చే నా సినిమా చూడొద్దు” అని అన్నారు. నాని ఆ మాట చెప్పడానికి ఆయనకు ఆ సినిమా కంటెంట్ మీద అంత నమ్మకం ఉంది. ఆయన నమ్మినట్టే, ‘కోర్ట్’ బ్లాక్‌బస్టర్ అయ్యింది. దాని తర్వాత సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది, ఎలాంటి సమస్య రాలేదు.
ప్రియదర్శికి ఎందుకు దెబ్బ పడింది?
ప్రియదర్శి కూడా నానిని ఫాలో అయ్యి అదే మాట అన్నారు. కానీ, ఇక్కడే అసలు సమస్య వచ్చింది
కథే లేదు… ‘మిత్రమండలి’ సినిమా స్టార్టింగ్ లోనే, “ఇందులో కథ అంటూ ఏమీ లేదు” అని ఒక డిస్‌క్లెయిమర్ వేశారు. కథే లేదని చెప్పిన సినిమాకు ఇంత ఓవర్-కాన్ఫిడెంట్‌గా ఛాలెంజ్ చేయడం జనాలకు నచ్చలేదు.
ప్రియదర్శి నమ్మకానికి భిన్నంగా, సినిమా విడుదలైన తర్వాత ఒక్క చోట కూడా పాజిటివ్ రివ్యూస్ రాలేదు. సినిమాకు నెగటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది.
తర్వాత సినిమాకు చిక్కు!
ఇప్పుడు ప్రియదర్శి చేసిన ఈ స్టేట్‌మెంట్ ఆయన తర్వాతి సినిమా ‘ప్రేమంటే’కు పెద్ద సమస్యగా మారింది. ‘మిత్రమండలి’ నచ్చని ఆడియన్స్, ప్రియదర్శి మాటను గుర్తుపెట్టుకుని, కావాలనే ‘ప్రేమంటే’ సినిమాను పట్టించుకోకపోతే, ఆయన కెరీర్‌పై అది భారీ ప్రభావం చూపిస్తుంది. సినిమా కంటెంట్ పక్కాగా ఉందని నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి డేరింగ్ స్టేట్‌మెంట్లు ఇవ్వాలి. నాని లాంటి స్టార్ ఆ మాట చెబితే ఒకలా ఉంటుంది, కానీ ఒక యంగ్ హీరో, అది కూడా కథ సరిగా లేని సినిమాకు ఆ మాట చెప్పడం అనేది రివర్స్ అయ్యింది. అందుకే, మాట జారితే ఏం జరుగుతుందో ప్రియదర్శిని చూస్తే అర్థమవుతుంది.


