Priyanka Chopra : మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న గ్లోబ్‌ట్రాటర్ మూవీతో ప్రియాంక చోప్రా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియన్ మూవీతో దాదాపు పదేళ్ల తర్వాత ఇండియన్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఇటీవలే ప్రియాంక ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మందాకిని అనే పాత్రలో కనిపించబోతున్నట్లు వెల్లడించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చీరకట్టులో గన్ పేలుస్తూ కనిపించింది. గ్లోబ్ ట్రాటర్‌లో అందం, ధైర్యం కలబోసిన క్యారెక్టర్‌లో ప్రియాంక కనిపించనున్నట్లు పోస్టర్‌తో మేకర్స్ హింట్ ఇచ్చారు. గ్లోబ్ ట్రాటర్‌తో ప్రియాంక కమ్‌బ్యాక్ అదిరిపోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.
ఎస్ఎస్ఎంబీ 29 ప్రియాంక చోప్రా డెబ్యూ తెలుగు మూవీ కాదు. కెరీర్ ఆరంభంలో 2002 సమయంలో అపురూపం పేరుతో తెలుగులో ఓ సినిమా చేసింది ప్రియాంక చోప్రా. మధుకర్, ప్రసన్న హీరోలుగా నటించిన ఈ సినిమాకు జీఎస్ రవికుమార్ దర్శకత్వం వహించాడు. ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిగా ప్రియాంక చోప్రా నటించింది. షూటింగ్ చివరి దశలో ఉండగా అపురూపం ఆగిపోయింది.
ఈ సినిమాకు చక్రి మ్యూజిక్ అందించారు. కొన్ని పాటలను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికీ అపురూపం సాంగ్స్ యూట్యూబ్‌లో కనిపిస్తుంటాయి. అపురూపంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సిన ప్రియాంక చోప్రా 23 ఏళ్ల తర్వాత మహేష్‌బాబు సినిమాతో అరంగేట్రం చేస్తోంది. ఎస్ఎస్ఎంబీ 29 కంటే ముందు బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పిన ప్రియాంక చోప్రా పదేళ్ల పాటు హాలీవుడ్ సినిమాలు చేసింది. బాలీవుడ్ స్థాయిలో ఫేమస్ కాలేకపోయింది. గ్లోబ్‌ట్రాటర్ మూవీ టైటిల్‌తో పాటు మహేష్‌బాబు ఫస్ట్‌లుక్‌ను నవంబర్ 15న (రేపు) రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ కన్ఫామ్ అయినట్లు సమాచారం. హైదరాబాద్‌లో భారీ స్థాయిలో గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ జరుగనుంది. మహేష్‌బాబు, రాజమౌళి మూవీలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తోన్నాడు. కుంభ అనే క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. 2027 ప్రథమార్థంలో గ్లోబ్‌ట్రాటర్ రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.


