Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభRaangi: పాలిటిక్స్ తో నాకేం పని? మ్యారేజ్ పై నో కొషన్స్ అంటున్న టాప్ హీరోయిన్

Raangi: పాలిటిక్స్ తో నాకేం పని? మ్యారేజ్ పై నో కొషన్స్ అంటున్న టాప్ హీరోయిన్

“పాలిటిక్స్ తో నాకేం పని, పైగా నాకు రాజకీయాలంటేనే అస్సలు ఇంట్రెస్ట్ ఉండద”ని హీరోయిన్ త్రిష క్రిష్ణన్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో సినిమా ఛాన్సులు పెద్దగా లేని త్రిష ఇక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, కాంగ్రెస్ లో చేరిపోతారనే రూమర్స్ కు ఆమె స్వయంగా చెక్ పెట్టినట్టైంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు రాజకీయాల గురించి ఆలోచించేంత తీరిక కూడా ఆమెకు లేదు. బ్యాక్ టు బ్యాక్ బిజీ షెడ్యూల్స్ తో ఆమె ఆకుపై ఉన్నారు. పొన్నియన్ సెల్వన్ సినిమాలో ‘కుందవి’ రోల్ ద్వారా ..ఇక త్రిష పని అయిపోయిందనుకున్న సినీ విమర్శకుల నోళ్లను త్రిష మూపించేశారు. పైగా ఇప్పుడు ఆమె చేతిలో విజయ్ దళపతి 67, అజిత్ ఏకే 62 ఉండగా.. ‘రంగి’ సినిమా రిలీజ్ కు రెడీ అయిపోయింది కూడా. ఏఆర్ మురుగదాస్ ‘రంగి’ సినిమాకు కథ అందించారు, లైకా ఈ సినిమా ప్రొడ్యూసర్ గా ఉండటంతో భారీగా ప్రమోషనల్ వర్క్స్ సాగుతున్నాయి. రంగి సినిమా ఈనెల 30వ తేదీన రిలీజ్ అవుతోంది. ఈ ప్రమోషనల్ ప్రోగ్రాముల్లో ఆమె మీడియాకు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇంటర్వ్యూలు ఇస్తూ పలు విషయాలపై ఓపన్ గా మాట్లాడుతున్నారు. 20 ఏళ్లుగా హీరోయిన్ గా ఉన్న త్రిషకు లవ్ అఫైర్లున్నాయన్న రూమర్లు ఓవైపు భారీగానే ఉండగా మరోవైపు ఆమె ఎంగేజ్మెంట్ కూడా బ్రేక్ చేసుకుని సింగిల్ గా ఉంటున్నారు. అయితే తన పెళ్లి ఎప్పుడని తనను ఎవరూ కొషన్ చేయరాదని ఆమె కోరుకున్నట్టు మీడియాకు చాలా స్పష్టంగా చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News