Sunday, November 16, 2025
HomeTop StoriesTollywood Heroines: గ్లామ‌ర్ క్వీన్స్‌.. హిట్ కోసం వెయిటింగ్‌

Tollywood Heroines: గ్లామ‌ర్ క్వీన్స్‌.. హిట్ కోసం వెయిటింగ్‌

Tollywood Heroines: కెరీర్ ఆరంభంలోనే స్టార్ హీరోలతో జతకట్టిన కొందరు గ్లామర్ బ్యూటీలు, ఒక దశలో వరుస అవకాశాలతో బిజీగా మారి పోయారు. కానీ తర్వాత వారి సినిమాల రిజ‌ల్ట్స్ రివ‌ర్స్ కావ‌టంతో కెరీర్ కొంత మందగించింది. టాలీవుడ్ నుంచి కొంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. మ‌రికొంద‌రు కొత్త‌గా జ‌ర్నీని షురూ చేస్తున్నారు. అలాంటి తమ రెండో ఇన్నింగ్స్‌ను మరింత స్టైల్‌గా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న స్టార్ బ్యూటీస్ ఎవ‌ర‌నే వివ‌రాల‌ను ఇప్పుడు చూసేద్దాం…

- Advertisement -

రాశీ ఖన్నా
తెలుగు ప్రేక్షకులకు ‘ఊహలు గుసగుసలాడే’, ‘జిల్’, ‘తొలిప్రేమ’ వంటి చిత్రాలతో దగ్గరైన రాశీ ఖన్నాకు సక్సెస్ లేకపోవటంతో మేకర్స్ ఆమెను పట్టించుకోలేదు. అదే స‌మ‌యంలో ఆమె త‌మిళ‌, హిందీ సినిమాల‌పై ఫోక‌స్ పెట్టారు. ఆ భాష‌ల్లోనూ ఆశించిన స్థాయిలో స‌క్సెస్ ద‌క్క‌క‌పోవ‌టంతో మ‌ళ్లీ తెలుగు సినిమాలవైపు చూసే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా మారుతోంది. దీపావ‌ళికి తెలుసు క‌దా సినిమాతో ప‌ల‌క‌రిస్తోంది. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీలోనూ న‌టించింది. త్వ‌ర‌లోనే మెగాస్టార్‌తోనూ జోడీ క‌ట్ట‌నుంది. వీటితో హిట్స్ కొట్టి మ‌ళ్లీ ఇక్క‌డే బిజీగా మారాల‌ని భావిస్తోంది.

Also Read- Peddi Update: బుచ్చిబాబుకి బ‌డ్జెట్ విష‌యంలో వార్నింగ్ ఇచ్చిన నిర్మాత‌.. ‘పెద్ది’ అప్డేట్ చెప్పేసిన డైరెక్టర్

పూజా హెగ్డే
ఎన్టీఆర్‌‌తో అరవింద సమేత వీర రాఘవ, మ‌హేష్‌ సరసన మహర్షి, రామ్ చ‌ర‌ణ్‌ తో ఆచార్య, ప్ర‌భాస్ కు జోడీగా రాధే శ్యామ్ వంటి సినిమాల్లో మురిపించిన బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ఒక‌ప్పుడు టాప్ ప్లేస్‌లో ఉండింది. భారీ రెమ్యునరేషన్ తీసుకుంది కూడా. అయితే వ‌రుస ప‌రాజ‌యాలు ఆమెను వెన‌క్కి లాగాయి. ఇప్పుడు త‌మిళ‌, హిందీల్లో సినిమాలు చేస్తోంది. రీసెంట్‌గా దుల్క‌ర్ స‌ల్మాన్ చేస్తోన్న తెలుగు సినిమాలో న‌టించే ఛాన్స్ అందుకుంది. ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కాల‌ని ఈ సొగ‌స‌రి భావిస్తోంది. అయితే దీనికి కాస్త స‌మ‌యం ప‌ట్టేలానే క‌నిపిస్తోంది.

మాళ‌వికా మోహ‌న‌న్
‘మాస్టర్’, ‘పేట’ వంటి అనువాద చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ముద్దుగుమ్మ మాళ‌వికా మోహ‌న‌న్‌. టాలీవుడ్ ఎంట్రీకి స‌మ‌యం తీసుకుంది. అయితే సాలిడ్‌గానే ఎంట్రీ ఇస్తోంది. ప్ర‌భాస్‌తో ది రాజాసాబ్ మూవీలో న‌టిస్తోంది. ఈ సినిమా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 9న రిలీజ్ కానుంది. మ‌రోవైపు మెగాస్టార్ చిరంజీవి, బాబీ సినిమాలోనూ అమ్మ‌డు అవ‌కాశాన్ని అందుకున్న‌ట్లు ఫిల్మ్ స‌ర్కిల్స్ టాక్‌. ఈ సినిమాల స‌క్సెస్‌తో తెలుగులో పాగా వేయాల‌ని అమ్మ‌డు భావిస్తోంది.

Also Read- Lavanya Tripathi: ఓటీటీలోకి మెగా కోడ‌లి త‌మిళ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ – తెలుగులోనూ రిలీజ్‌

ఈ ముగ్గురు హీరోయిన్స్‌లో ఇద్దరు రీ ఎంట్రీ సక్సెస్ కోసం వెయిటింగ్. మరొకరు జర్నీని స్టార్ట్ చేస్తున్నారు. మరి ఈ ముద్దుగుమ్మలు కెరీర్ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad