Sunday, November 16, 2025
HomeTop StoriesRAHUL RAMAKRISHNA: "నన్ను చంపేయండి".. రాహుల్ రామకృష్ణ సంచలన ట్విట్?

RAHUL RAMAKRISHNA: “నన్ను చంపేయండి”.. రాహుల్ రామకృష్ణ సంచలన ట్విట్?

RAHUL RAMAKRISHNA Controversial Tweet: అర్జున్ రెడ్డి, జాతిరత్నాలు, RRR, బ్లాక్‌బస్టర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యువ నటుడు రాహుల్ రామకృష్ణ… నటనతో కంటే, తన వివాదాస్పద సోషల్ మీడియా పోస్ట్‌లతోనే ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వరుస ట్వీట్లు అటు చిత్ర పరిశ్రమలో, ఇటు రాజకీయాల్లోనూ పెను దుమారం రేపుతున్నాయి.

- Advertisement -

తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు:

రాహుల్ రామకృష్ణ ఈసారి ఏకంగా తెలంగాణ ప్రభుత్వాన్నే టార్గెట్ చేస్తూ చేసిన ట్వీట్లు హాట్ టాపిక్‌గా మారాయి.
“మనం భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం. డంబుల్డోర్ కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాను” అంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు. ఇది ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ,
“నేను విసిగిపోయాను, నన్ను చంపేయండి” అంటూ తీవ్ర నిరాశను, కోపాన్ని వ్యక్తం చేశారు.
మరొక పోస్ట్ చేసి “హైదరాబాద్ మునిగిపోయింది, హామీలన్నీ విఫలమయ్యాయి, వీటిని చక్కదిద్దడానికి ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు” అంటూ కేసీఆర్‌ను ట్యాగ్ చేసాడు,ఈ పోస్ట్లు అన్ని చూస్తుంటే గత (BRS) పాలన తిరిగి రావాలని కోరుకున్నట్లుగా ఉంది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/ohmkar-raju-gari-gadhi-4-officially-announced/

ఇండస్ట్రీ టాక్, రాహుల్ రామకృష్ణ కి సినిమా ఆఫర్లు తగ్గుతున్నాయా?

రాహుల్ రామకృష్ణ నిత్యం ఇటువంటి రాజకీయ, సామాజిక వివాదాల్లో తలదూర్చడంపై చిత్ర పరిశ్రమలో తీవ్రమైన చర్చ నడుస్తోంది. కొంతమంది సినీ పెద్దలు, నిర్మాతలు ఆయన తీరుతో విసిగిపోయారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వాలు మారినా, ఎవరూ రాజకీయ వివాదాలున్న నటులను తమ సినిమాల్లో పెట్టుకోవడానికి ఆసక్తి చూపించరు. ముఖ్యంగా ఒక పార్టీని తీవ్రంగా విమర్శించే నటుడితో సినిమా తీస్తే, ఆ సినిమా విడుదల సమయంలోనో, లేదా ప్రభుత్వ కార్యకలాపాల పరంగానో ఇబ్బందులు ఎదురవుతాయేమోనని నిర్మాతలు భయపడుతూ ఉంటారు.
దీంతో, రాహుల్ రామకృష్ణకు గతంతో పోలిస్తే సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఆయన నోరు తెరిస్తే,తన సినిమా కెరీర్‌ మీద ప్రభావం చూపుతుంది అని కొందరు సన్నిహితులు హెచ్చరించినా ఆయన పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

అసలు నిజం ఏంటి?

అయితే వినిపిస్తున్న మరొక టాక్ ఏంటి అంటే, రాహుల్ తన సంపాదన అంత రియల్ ఎస్టేట్ పెట్టి బాగా నష్టపోయిన నట్టు తెలుస్తుంది. అందుకు కాంగ్రేస్ ప్రభుత్వం పై తన కోపాన్ని తీర్చుకుంటూ ఈ పోస్ట్లు
చేస్తున్నాడు అంటూ గుస గుసలు వినిపిస్తున్నాయి.
ఇక ప్రభుత్వం పై ఇలాంటి పోస్ట్లు వేసిన దగ్గర నుండి తన ” X ” అకౌంట్ అనేది బ్లాక్ అయిపొయింది. మరి అది తానే చేసుకున్నాడా లేదా ఎవరైనా చేసారా అనేది తెలియాల్సి ఉంది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/first-single-from-mana-shankaravaraprasadgaru/

గతంలో కూడా రాహుల్ రామకృష్ణ ఇటువంటి పోస్ట్‌లతో వార్తల్లో నిలిచారు:

ఓ రైలు ప్రమాదం, ‘పుష్ప 2’ తొక్కిసలాట ఘటనలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ చేసి, ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో దాన్ని వెనక్కి తీసుకున్నారు.

గాంధీ జయంతి నాడు “గాంధీజీ గొప్పవాడని నేను అనుకోవట్లేదు” అని పోస్ట్ చేసి సంచలనం సృష్టించారు.
రాహుల్ రామకృష్ణ తన నోటి దూకుడు తగ్గించుకోకపోతే, ఆయన సినీ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్లే అని కొంతమంది భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad