SSMB29 Latest Updates: సూపర్‌స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu), దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) కలయికలో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం SSMB 29. ప్రస్తుతం సినిమా షూటింగ్ అనుకున్న ప్లానింగ్ ప్రకారం శరవేగంగా జరుగుతోంది. ట్రిపులార్ తర్వాత జక్కన్న తెరకెక్కిస్తోన్న మూవీ కావటంతో సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులే కాదు.. సినీ సర్కిల్స్ కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్, ఒరిస్సాల్లో కొంత షూటింగ్‌ను పూర్తి చేశారు. తదుపరి షెడ్యూల్‌ను కెన్యాలో చేయటానికి ప్లాన్ చేశారు మేకర్స్. ఈ షెడ్యూల్ కోసం ఏర్పాట్లన్నీ రెండు నెలల ముందే పూర్తి చేసుకున్నారు. అయితే, కెన్యాలో జరుగుతున్న నిరసనల (protests) కారణంగా ఈ షెడ్యూల్ జరగటం లేదని సమాచారం. కెన్యాలోని పరిస్థితులు, భద్రతాపరమైన విషయాలను దృష్టిలో ఉంచుకొని, రాజమౌళి అండ్ టీమ్ కెన్యాలో షూటింగ్ వద్దనుకున్నారు.
Also Read – IND vs ENG 3rd Test: జడేజా పోరాటం వృథా.. లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ గెలుపు..
రాజమౌళి బృందం SSMB 29 నెక్ట్స్ షెడ్యూల్ కోసం ఇప్పుడు కెన్యాకు ప్రత్యామ్నాయంగా ఉండే ఇతర లొకేషన్ల కోసం అన్వేషణ ప్రారంభించింది. ముఖ్యంగా టాంజానియా (Tanzania), దక్షిణాఫ్రికా (South Africa) వంటి ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాలలో షూటింగ్ చేస్తే ఎలా ఉంటుంది. కథకు తగ్గ లొకేషన్స్ ఇక్కడ ఉంటాయా? అని పరిశీలిస్తున్నారు. అంతా అనుకున్నట్లు కుదిరితే మూవీ కొత్త షెడ్యూల్స్ త్వరలో ప్లాన్ చేసి, ఖరారు చేసుకుంటారు. SSMB 29 చిత్రం ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ యాక్షన్ (forest adventure action film) సినిమాగా రూపొందుతోంది. మహేష్ బాబుతో పాటు, ఈ సినిమాలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), ఆర్ మాధవన్ (R Madhavan) వంటి ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
SSMB 29 కోసం రాజమౌళి వారణాసి (Vaaranasi) అనే టైటిల్‌ను కూడా అనుకున్నారు. అయితే అది మరో దర్శకుడు రిజిష్టర్ చేశాడని, సదరు దర్శకుడిని టైటిల్ కోసం కాంటాక్ట్ అయితే తన టైటిల్‌ను SSMB 29 కోసం ఇవ్వలేనని చెప్పేసినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ సహా అందరినీ మెప్పించేలా డాన్స్ నెంబర్ ఉండబోతుందని కూడా సమాచారం. దీని కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన మార్కెట్ సెట్ సూపర్‌స్టార్‌పై జక్కన్న సోలో సాంగ్‌ను చిత్రీకరించినట్లు టాక్. ఇంతకు ముందు మగధీరలో (Magadheera) రామ్ చరణ్, యమదొంగలో (Yamadonga) ఎన్టీఆర్ వేసిన డాన్స్ ఇప్పటికీ గుర్తున్నాయి. అలాంటి డాన్స్ నెంబర్‌ను మహేష్ కోసం రాజమౌళి క్రియేట్ చేయబోతున్నారని టాక్.
Also Read – Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!


