Jailer 2: కూలీ మూవీతో ఇటీవలే ప్రేక్షకులను పలకరించాడు రజనీకాంత్. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీ హైప్‌తో రిలీజైంది. రజనీకాంత్ ఇమేజ్‌కు తగ్గట్లుగా స్టోరీ లేకపోవడం, లోకేష్ గత సినిమాల స్థాయిలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిస్సవ్వడంతో యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. టాక్‌తో సంబంధం లేకుండా ఐదు వందల కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. రజనీకాంత్‌తో పాటు నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్‌ఖాన్ వంటి స్టార్ హీరోలు సినిమాలో భాగం కావడం కూలీకి కలిసివచ్చింది.
జూన్ 12న రిలీజ్…
కూలీ తర్వాత జైలర్ 2 సినిమా చేస్తున్నాడు రజనీకాంత్. జైలర్‌కు సీక్వెల్‌గా డైరెక్టర్ నెల్సన్ ఈ మూవీని రూపొందిస్తున్నారు. జైలర్ 2 రిలీజ్ డేట్‌ను రజనీకాంత్ రివీల్ చేశారు. చెన్నైలో ఓ ఈవెంట్‌లో పాల్గొన్న రజనీకాంత్… జైలర్ 2 మూవీని 2026 జూన్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. రజనీకాంత్ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఖుషి అవుతోన్నారు.
Also Read – Botsa Satyanarayana: వైఎస్ విగ్రహాలపై సభలో రచ్చ.. శాసనమండలి నుంచి బొత్స వాకౌట్
ఆరు వందల కోట్ల కలెక్షన్స్…
2023లో రిలీజైన జైలర్ మూవీ రజనీకాంత్ కెరీర్‌లోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఆరు వందల కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది. తమిళ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సెకండ్ మూవీగా నిలిచింది.
జైలర్ మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ గెస్ట్ రోల్స్ చేశారు. సీక్వెల్‌లో వీరిద్దరితో పాటు బాలకృష్ణ, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి అతిథి పాత్రల్లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సీక్వెల్‌లో ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. రమ్యకృష్ణ, యోగిబాబు, మిర్నా మీనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
మల్టీస్టారర్ మూవీ…
కూలీ రిజల్ట్‌తో సంబంధం లేకుండా లోకేష్ కనగరాజ్‌తో మరో సినిమాకు రజనీకాంత్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో కోలీవుడ్ అగ్ర హీరో కమల్‌హాసన్ మరో హీరోగా కనిపించబోతున్నాడు. దాదాపు 46 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత రజనీకాంత్, కమల్‌హాసన్ కలయికలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాను కమల్‌హాసన్ స్వయంగా నిర్మించబోతున్నారు.
Also Read – National Award : జాతీయ అవార్డుతో ఐదేళ్ల చిన్నారి త్రిష తోసర్ సంచలనం


