Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ గుడ్ టైమ్ స్టార్టయినట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది ఈ ఢిల్లీ బ్యూటీ. ఆ క్రేజ్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ విజయాలను దక్కించుకుంది. ఎంత త్వరగా నంబర్‌వన్ ప్లేస్‌కు చేరుకుందో అంతే ఫాస్ట్‌గా రకుల్ కెరీర్ డౌన్ అయ్యింది. రకుల్ హిట్టు అందుకొని నాలుగైదేళ్లు దాటింది. ఈ ఏడాది రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించిన మేరే హజ్బెండ్ కీ బీవీ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. అరవై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 12 కోట్ల లోపే వసూళ్లను దక్కించుకున్నది.
రూమర్స్‌కు పుల్‌స్టాప్…
మేరే హజ్బెండ్ కీ బీవీ ఫ్లాప్‌తో బాలీవుడ్‌లోనూ రకుల్ కెరీర్ క్లోజయినట్లు ప్రచారం జరిగింది. ఈ పుకార్లకు పుల్‌స్టాప్ పెడుతూ సోమవారం కొత్త సినిమా సెట్స్‌లో అడుగుపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. ఫస్ట్ డే షూటింగ్ పూర్తయినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. షూటింగ్ తాలూకు ఒత్తిడి నుంచి బయటపడటానికి స్విమ్మింగ్ చేస్తున్నట్లు చెప్పింది. పింక్ కలర్ క్యాప్‌తో స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
Also Read- Reliance Jio: జియో కొత్త చవకైన రీఛార్జ్ ప్లాన్.. ఎయిర్‌టెల్‌కి షాకిస్తూ 189 ప్లాన్ విడుదల..
సీక్వెల్‌లో…
పతి పత్నీ ఔర్ వో మూవీ సీక్వెల్‌లో రకుల్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. 2019లో రిలీజైన పతి పత్నీ ఔర్ వో మూవీ వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ రొమాంటిక్ కామెడీ సీక్వెల్‌లో రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు సారా అలీఖాన్, వామికా గబ్బి కథానాయికలుగా నటిస్తున్నారు. ఆయుష్మాన్ ఖురానా హీరోగా కనిపించబోతున్నాడు.
మనీష్ మల్హోత్రా మూవీలో…
పతి పత్నీ ఔర్ వోతో పాటు దేదే ప్యార్ దే 2లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు సెలిబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న మూవీలో రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా కనిపించబోతున్నది. ఈ సినిమాను ఇటీవల రకుల్‌తో పాటు మనీష్ మల్హోత్రా అఫీషియల్‌గా ప్రకటించారు. బాలీవుడ్‌లో వరుసగా మూడు సినిమాలను అంగీకరించి మళ్లీ సినిమాల స్పీడు పెంచింది రకుల్.
కొండపొలం తర్వాత…
టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై రకుల్ కనిపించి నాలుగేళ్లు దాటిపోయింది. చివరగా క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్‌తేజ్ హీరోగా నటించిన కొండపొలం సినిమా చేసింది. పరాజయాల కారణంగా టాలీవుడ్‌కు దూరమైంది. తమిళంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఇండియన్ 3 రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇండియన్ 2 డిజాస్టర్‌తో ఈ మూడో పార్ట్ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read- Athulya Ravi: మైండ్ బ్లోయింగ్ ఫోజులతో మాయ చేస్తున్న టాలీవుడ్ నయా బ్యూటీ


