Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభRam Charan: జానీ మాస్ట‌ర్‌కు ఛాన్స్ ఇచ్చిన రామ్‌చ‌ర‌ణ్.. మైసూర్‌లో వెయ్యి మంది డ్యాన్స‌ర్స్‌తో పెద్ది...

Ram Charan: జానీ మాస్ట‌ర్‌కు ఛాన్స్ ఇచ్చిన రామ్‌చ‌ర‌ణ్.. మైసూర్‌లో వెయ్యి మంది డ్యాన్స‌ర్స్‌తో పెద్ది సాంగ్ షూట్‌

Ram Charan: రామ్‌చ‌ర‌ణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న పాన్ ఇండియ‌న్ మూవీ పెద్ది కోసం మెగా ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో క‌న్న‌డ అగ్ర హీరో శివ‌రాజ్‌కుమార్ ఓ కీల‌క పాత్ర చేస్తున్నారు. రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా వ‌చ్చే ఏడాది మార్చి 27న పెద్ది రిలీజ్ కాబోతుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది.

- Advertisement -

ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌…
వినాయ‌క‌ చ‌వితిని పుర‌స్క‌రించుకొని పెద్ది మూవీ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను డైరెక్ట‌ర్ బుచ్చిబాబు రివీల్ చేశాడు. ఈ సినిమా సాంగ్ షూట్ బుధ‌వారం నుంచి మైసూర్‌లో మొద‌లైన‌ట్లు ప్ర‌క‌టించాడు. “ర‌హ‌మాన్‌ గారి డ‌ప్పు… రామ్ చ‌ర‌ణ్ గారి స్టెప్పు… ఇది మెగా ప‌వ‌ర్ స్టార్ బ్లాస్ట్‌… న‌న్ను న‌మ్మండి ఫ్యాన్స్” అంటూ ఓ ట్వీట్ పెట్టాడు బుచ్చిబాబు సానా. రామ్‌చ‌ర‌ణ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌గా ఈ మైసూర్ పాట సినిమాలో వ‌స్తుంద‌ట‌. దాదాపు వెయ్యి మంది డ్యాన్స‌ర్స్‌తో లావీష్‌గా ఈ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. ఈ ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ కోసం ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ మాస్ ట్యూన్ రెడీ చేసిన‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఈ పాట‌లో రామ్‌చ‌ర‌ణ్ స్టెప్పులు, ఆయ‌న స్క్రీన్‌ప్ర‌జెన్స్ అద్భుతంగా ఉంటాయ‌ని అంటున్నారు. ఈ సాంగ్‌కు జానీ మాస్ట‌ర్ కొరియోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

స్పెష‌ల్ వీడియో…
సెట్స్ నుంచి ఓ వీడియోను అభిమానుల‌తో పంచుకున్నారు మేక‌ర్స్‌. ఇందులో రా అండ్ ర‌స్టిక్ లుక్‌లో చ‌ర‌ణ్ క‌నిపిస్తున్నారు. డైరెక్ట‌ర్ బుచ్చిబాబుతో పాటు జానీ మాస్ట‌ర్‌, డీవోపీ ర‌త్న‌వేలు ఈ వీడియోలో క‌నిపించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Also Read – Medak Floods: మెదక్ వరదలు: పౌల్ట్రీ ఫాం ధ్వంసం, వేల కొద్దీ కోళ్ల మృతి..!

జైలులో జానీ మాస్ట‌ర్‌…
త‌న అసిస్టెంట్‌పై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌నే ఆరోప‌ణ‌ల కార‌ణంగా జానీ మాస్ట‌ర్‌పై పోలీసులు పోక్సో కేసు న‌మోదు చేశారు. కొన్నాళ్లుగా జైలులో ఉన్నాడు. ఈ ఆరోప‌ణ‌ల‌ కార‌ణంగా జానీ మాస్ట‌ర్ నేష‌న‌ల్ అవార్డు ర‌ద్దు అయ్యింది. సినిమా అవ‌కాశాలు త‌గ్గాయి. లాంగ్ గ్యాప్ త‌ర్వాత పెద్దితో తెలుగులో స్టార్ హీరో సినిమాకు ప‌నిచేసే ఛాన్స్ ద‌క్కించుకున్నాడు జానీ మాస్ట‌ర్‌.

జాన్వీక‌పూర్ హీరోయిన్‌…
పెద్ది మూవీలో రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌తో క‌లిసి వృద్ధి సినిమాస్ ప‌తాకంపై వెంక‌ట స‌తీష్ కిలారు దాదాపు మూడు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

Also raed – Railway Jobs : గోల్డెన్ ఛాన్స్.. రైల్వేలో 3518 ఖాళీలు.. ఇప్పుడే అప్లై చేయండి!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad