Rashmika Mandanna: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ మూవీ జూలై 31న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. శనివారం తిరుపతిలో జరిగిన ఈవెంట్‌లో కింగ్డమ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అన్నదమ్ముల అనుబంధం, యాక్షన్ అంశాలతో ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఈ ట్రైలర్‌లో పోలీస్‌గా, ఖైదీగా, వారియర్‌గా… డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో విజయ్ దేవరకొండ కనిపించాడు. ట్రైలర్‌తో ఈ సినిమా జానర్ ఏమిటన్నది మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
రష్మిక రియాక్షన్…
కింగ్డమ్ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ ట్రైలర్‌పై హీరోయిన్ రష్మిక మందన్న రియాక్ట్ అయ్యింది. ఓ ట్వీట్ పెట్టింది. విజయ్ దేవరకొండ ఫైర్‌ను కింగ్డమ్‌లో చూస్తామని ఈ ట్వీట్‌లో రష్మిక చెప్పింది. ముగ్గురు జీనియస్‌లు కలిసి ఎలాంటి అద్భుతాల్ని సృష్టించారో చూడాలని ఆసక్తిగా ఉందని తెలిపింది. కింగ్డమ్ రిలీజ్ డేట్ అయిన 31 కోసం తాను ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నట్లు ట్వీట్‌లో వెల్లడించింది. రష్మిక మందన్న ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read – Peddi Movie: పెద్ది డైరెక్టర్‌కు అనసూయ వార్నింగ్ – కారణం ఇదే!
ప్రేమలో ఉన్నారా?
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. జంటగా ఫారిన్ ట్రిప్‌లకు వెళ్లిన ఫొటోలు పలుమార్లు బయటకు వచ్చాయి. విజయ్ ఇంట్లో జరిగే ప్రతి వేడుకలో రష్మిక మందన్న పాల్గొంటూ వస్తోంది. అతడి కుటుంబసభ్యులతో రష్మికకు చక్కటి అనుబంధం ఉంది. విజయ్, రష్మిక పెళ్లి చేసుకోవడం ఖాయమంటూ చెబుతోన్నారు. అయితే ప్రేమ, పెళ్లి పుకార్లపై ఇద్దరు సెలైంట్‌గానే ఉంటూ వస్తున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలయికలో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు వచ్చాయి.
భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్…
విజయ్ దేవరకొండ హిట్టు అందుకొని చాలా కాలమైంది. కింగ్డమ్ సక్సెస్ అతడి కెరీర్‌కు కీలకంగా మారింది. ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా కింగ్డమ్‌తో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. రౌడీ జనార్ధనతో పాటు టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్‌తో ఓ హిస్టారికల్ మూవీని అంగీకరించాడు.
ఛావా… కుబేర…
మరోవైపు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్‌బస్టర్స్‌ను అందుకుంటోంది రష్మిక మందన్న. ఈ ఏడాది రష్మిక హీరోయిన్‌గా నటించిన ఛావాతో పాటు కుబేర పెట్ట హిట్టయ్యాయి. తెలుగులో ది గర్ల్‌ఫ్రెండ్‌తో పాటు మైసా సినిమాలు చేస్తున్నాడు. బాలీవుడ్‌లో ఓ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Also Read – Varsha Bollamma: ఓటీటీలోకి తమ్ముడు హీరోయిన్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ – స్ట్రీమింగ్ ఎప్పుడంటే?


