Ravi Kishan Personal Life: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన రేసు గుర్రం (Race Gurram) సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో హీరోకి ఎంత పేరొచ్చిందో విలన్ రవి కిషన్‌కు కూడా అంతే పేరొచ్చింది. బోజ్ పురి నటుడైన రవి కిషన్ ఈ మూవీ తర్వాత వరుస అవకాశాలను అందుకున్నారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. మరో వైపు పార్లమెంట్ మెంబర్‌గానూ క్రీయాశీలక రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. తాజాగా ఆయన తన సతీమణి ప్రీతి కిషన్‌ను (Preeti Kishan) ఉద్దేశించి, ఆమెపై తన ప్రేమను వెల్లడిస్తూ చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
జీవితంలో తాను కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు తన సతీమణి ప్రతినే తనకు అండగా నిలబడిందని రవి కిషన్ పేర్కొన్నారు. అందుకే ఆమెకు కృతజ్ఞతలు చెప్పనిదే తాను నిద్రపోనని ఆయన తెలిపారు. సన్ ఆఫ్ సర్దార్ 2 (Son Of Sardar 2) ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ నేను ప్రతీ రోజు నా భార్య నిద్రపోయిన తర్వాత ఆమె పాదాలను తాకుతాను. ఆమె మెలకువగా ఉంటే అందుకు అంగీకరించదు కాబట్టి.. నిద్రపోయినప్పుడే చేస్తాను అని రవి కిషన్ ఎమోషనల్‌గా చెప్పారు.
Also Read – Thiruvananthapuram: కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కన్నుమూత
డబ్బు, పేరు ఏదీ లేని సమయంలో తన సతీమణి ప్రీతి తనకు అండగా నిలబడిందని, ఎన్నో ఆటు పోట్లు తట్టుకుందని ఆయన గుర్తు చేసుకున్నారు. తనకు అంత చేసి, తాను ఈ స్థాయిలో ఉండటానికి తన భార్యే కారణమని .. అలాంటి వ్యక్తికి తాను ఏమివ్వగలను అందుకనే ఆమె పాదాలను తాకి కృతజ్ఞతలు తెలియజేస్తానని రవికిషన్ తెలిపారు.
1993లో తన చిన్ననాటి స్నేహితురాలైన ప్రీతిని రవి కిషన్ పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు.. ఒక అబ్బాయి, ముగ్గురమ్మాయిలు. నార్త్ సినిమాలతో పాటు దక్షిణాది సినిమాలు, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఈయన సుపరిచితులే. రీసెంట్‌గా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బాబీ కాంబోలో తెరకెక్కిన డాకు మహారాజ్ లో (Daaku Maharaaj) కీలక పాత్రలో రవి కిషన్ కనిపించారు. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ (Gorakhpur) నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. తన వృత్తి జీవితంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ తన భార్య మద్దతును బహిరంగంగా అంగీకరించడం ద్వారా రవి కిషన్ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.
Also Read – VS Achuthanandan : కేరళ మాజీ సీఎం.. అచ్యుతానందన్ ఇకలేరు!


