ఏపీ హైకోర్టులో రామ్‌గోపాల్ వర్మ (RGV) మరో పిటిషన్ వేశారు. తాను ఎక్స్‌లో పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా ఒక విషయంపై ఇన్ని కేసులు పెడుతున్నారని ఆర్జీవీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధమని తెలిపిన వర్మ.. ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని పిటిషన్ లో న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని కోరారు. నేడు వర్మ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది.
చట్టవిరుద్ధంగా కేసులు పెడుతున్నారు.. హైకోర్టులో RGV పిటిషన్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES