Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభVijay Deverakonda: కొత్త సినిమాకు సిద్ధమవుతున్న ‘రౌడీ’ హీరో.. ‘ఖుషి’ పక్కనపెట్టేశాడా?

Vijay Deverakonda: కొత్త సినిమాకు సిద్ధమవుతున్న ‘రౌడీ’ హీరో.. ‘ఖుషి’ పక్కనపెట్టేశాడా?

Vijay Deverakonda: ‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ‘లైగర్’ భారీ ఫ్లాప్ మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో కొత్త సినిమా విషయంలో కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పటికే నటిస్తున్న ‘ఖుషి’ చిత్ర షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది.

- Advertisement -

ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఆగిపోయిందని, హీరోయిన్ సమంత చిత్రం నుంచి తప్పుకుందనే ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారాన్ని చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. సమంత అనారోగ్యం వల్లే చిత్ర షూటింగ్ వాయిదా పడిందని తెలిపింది. కాగా, సమంత కోలుకుని తిరిగొస్తే కానీ, చిత్ర షూటింగ్ ప్రారంభం కాదు. అలాగే సమంత ఎప్పుడొచ్చేది అనే విషయంలో స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో దొరికిన టైమ్ సద్వినియోగం చేయాలని భావిస్తున్న విజయ్ దేవరకొండ మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు.

‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో కొత్త చిత్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. రామ్ చరణ్‌తో సినిమా చేయాలని భావించిన గౌతమ్.. ఆ చిత్రం క్యాన్సిల్ కావడంతో విజయ్‌కు మరో కథ వినిపించాడు. ఈ కథను విజయ్ వెంటనే ఓకే చేశాడు. దీంతో ఈ చిత్రం ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రం సితార్ ఎంటర్‌‌టైన్‌మెంట్స్ బ్యానర్‌‌పై తెరకెక్కే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News