Tuesday, February 11, 2025
Homeచిత్ర ప్రభBrahmamudi February 10th Episode: దుగ్గిరాల కుటుంబానికి నిజం చెప్పేసిన అనామిక.. కావ్య, రాజ్‌లు ఏం...

Brahmamudi February 10th Episode: దుగ్గిరాల కుటుంబానికి నిజం చెప్పేసిన అనామిక.. కావ్య, రాజ్‌లు ఏం చేస్తారు..

ఈరోజు ఎపిసోడ్‌లో రుద్రాణి అనామికకు ఫోన్ చేసి ఏమైనా చేస్తావా నా ప్లాన్‌లు నన్ను వేసుకోమంటావా అని అడిగితే కంగారు పడకండి మీ ఇంట్లో ఏమి జరిగినా అది నేను స్కెచ్ వేసినట్టే జరుగుతుంది. అలాగే రేపు మీ మనవరాలి బారసాలకు వచ్చి ఇంకో బాంబు పేలుస్తాను అంటుంది అనామిక. ఉదయాన్నే పాప కోసం కావ్య, అపర్ణ ఉయ్యాలను తయారుచేస్తారు. ఈలోగా అక్కడికి ఇందిరా దేవి వస్తే సరదాగా మాట్లాడుకుంటారు. ఇదంతా దూరం నుంచి చూస్తూ రుద్రాణి, ధాన్యలక్ష్మి మండిపోతూ అన్ని లెక్కలు తేలుస్తాను అంటుంది దాన్యం. అక్క విషయానికి వచ్చేసరికి లెక్కలు వేయకుండా ఏర్పాట్లు చేస్తుంది అని కావ్య మీద మండిపోతుంది రుద్రాణి. ఆ తర్వాత ధాన్యలక్ష్మి రుద్రాణిని ఇది నీ మనవరాలి ఫంక్షన్ కదా మరి నువ్వేంటి ఏ పని చేయకుండా అలా ఉన్నావు అంటే వాళ్లు చేస్తున్నారుగా చూసి తరిస్తున్నాను అని వెటకారంగా సమాధానమిస్తుంది.

- Advertisement -

మరోపక్క రోహుల్ ఇంకా రెడీ అవ్వలేదని రాజ్, కళ్యాణ్ తిట్టి రెడీ అవ్వమని చెప్తారు. అంతటిలో కనకం బారసాల ఫంక్షన్‌కు వస్తుంది. రుద్రాణి గురించి తెలిసిందేగా కనకాన్ని మాటలు అని మాటలు పడుతుంది. కనకం సమాధానం చెప్తుందని కనకం పరువు తీయాలని రుద్రాణి పెట్టు పోతలు గురించి ఎత్తి అవమానిస్తుంది. కనకం ఊరుకుంటుందా సరిగ్గా ఇస్తుంది. దెబ్బకు రుద్రాణి నోరుమూస్తుంది. ఆ తర్వాత కనకం స్వప్న, మనవరాలిని చూసి తెగ సంతోషపడుతుంది. సరదాగ మీ అత్త పోలికలు రాలేదు అంటే వస్తే అక్కడే హాస్పిటల్‌లో వదిలేసి వచ్చేదును అని నవ్వుతూ అంటుంది స్వప్న.

తర్వాత ఇంట్లో అందరూ సంతోషంగా స్వప్న కూతురికి బారసాల అందరూ కలిసి చేస్తారు.. అలా పాపను ఉయ్యాలలో వేసి దీవించాక ఇక అప్పుడే అక్కడికి అనామిక వస్తుంది. ఇంట్లో అందరూ తనని చూసి షాక్ అవుతారు రుద్రాణి మాత్రం సంతోషపడుతుంది. వచ్చి సినిమా ఎండ్ కార్డ్‌లో వచ్చినట్టు అందరూ ఒకేచోటకు వచ్చారు బాగుంది ఇలా చూడటానికి అమాయికులను మేల్కొలపడానికి వచ్చాను అని అంటుంది. దుగ్గిరాల కుటుంబంలో ఎంత అన్యాయం జరుగుతుందో తెలుసా అని స్టార్ట్ చేస్తే ఇందిరా దేవి ఆపి తిడుతుంది. అందరూ వెళ్లిపోమన్నా కుడా వెళ్లకుండా ఉంటే రుద్రాణి మాత్రం ఎందుకు పంపిచేస్తున్నారు ఏమి చేప్పాలి అనుకుంటుందో చెప్పనివ్వండి అంటుంది. అనామిక రాజ్, కావ్యలు చేసింది చెప్పడానికి వచ్చాను ఏ చెప్పమంటారా అంటే మధ్యలో కనకం నా కూతురని ఛీ కొట్టే అంత విషయం చేసింది అని అంటుంది. రుద్రాణి, ధాన్యలక్ష్మి అనామికను విషయం చెప్పమంటారు. అప్పుడు మొదలెడుతుంది అనామిక ఇప్పటి వరకూ ఇంట్లో జరిగిన విషయాలు చెప్పడం స్టార్ట్ చేస్తుంది.. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News