Samantha: ఒకప్పుడు టాలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్‌గా కొనసాగింది సమంత. మహేష్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ హీరోయిన్‌గా వరుస సక్సెస్‌లను దక్కించుకుంది. పెళ్లి వరకు గ్యాప్ లేకుండా కమర్షియల్ సినిమాలు చేసిన సమంత ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ మూవీస్ వైపు ఫోకస్ పెట్టింది. ఈ జానర్‌లో ఆశించిన స్థాయిలో సమంతకు కలిసి రాలేదు. విడాకులు, మయో సైటీస్ కారణంగా సమంత కెరీర్‌కు లాంగ్ బ్రేక్ వచ్చింది.
శుభం సినిమాతో నిర్మాతగా…
దాదాపు రెండేళ్ల విరామం ఆ తర్వాత ఇటీవల శుభం సినిమాలో గెస్ట్ రోల్‌లో తళుక్కున మెరిసింది. ఈ హారర్ కామెడీ మూవీకి తానే నిర్మాత కావడం, చిన్న హీరోలు నటించిన సినిమా కావడంతో క్రేజ్ కోసం చిన్న రోల్ చేసింది. యాక్టర్‌గా సమంత రోల్‌పై విమర్శలు వచ్చినా నిర్మాతగా మాత్రం హిట్టు అందుకుంది.
Also Read – MG M9: ఎంజీ నుంచి నయా ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ ఛార్జ్ తో 548KM రేంజ్..
రీఎంట్రీ ఎప్పుడు?
హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి సమంత రీఎంట్రీ ఎప్పుడన్నది మాత్రం ఆసక్తిగా మారింది. టాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు బాలీవుడ్ ముద్దుగుమ్మలపై మనసుపడుతోన్నారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న అగ్ర హీరోల సినిమాల్లో దాదాపు బాలీవుడ్ బ్యూటీస్ హీరోయిన్లుగా కన్ఫామ్ అయ్యారు. వారితో పాటు నవతరం నాయికల పోటీని తట్టుకొని టాలీవుడ్‌లో ఆఫర్లు దక్కించుకోవడం అంత ఈజీ కాదు. సమంతకు మునుపటి స్థాయిలో క్రేజ్ లేకపోవడంతో ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు రెడీగా లేనట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సమంత సమకాలీన నాయికలైన కాజల్, తమన్నా కూడా ఆఫర్ల రేసులో వెనుకబడిపోయారు.
హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్…
ఓ హిట్టుతో కమ్‌బ్యాక్ ఇవ్వాలనే ప్రయత్నాల్లో సమంత హీరోయిన్‌గా తెలుగులో ఓ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ సినిమాను స్వీయ నిర్మాణ సంస్థ ట్రాటాలా మోషన్ పిక్చర్స్ పతాకంపై సమంతనే స్వయంగా నిర్మించబోతున్నట్లు సమాచారం. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి సమంత స్నేహితురాలు, అలా మొదలైంది ఫేమ్ నందిని రెడ్డి దర్శకత్వం వహించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సమంత రీఎంట్రీ మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నట్లు తెలిసింది. త్వరలోనే సమంత, నందిని రెడ్డి మూవీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం.
విజయ్ దేవరకొండ ఖుషి…
చివరగా తెలుగులో హీరోయిన్‌గా ఖుషి సినిమాలో నటించింది సమంత. 2023లో రిలీజైన ఈ మూవీలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.


