Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా తెలుగు చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్ అయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకి రౌడీ హీరో అనే ట్యాగ్ వచ్చేసింది. తెలుగులో ఇంతటి ఘన విజయాన్ని అందుకున్న అర్జు రెడ్డి మూవీ హిందీలో సందీప్ డైరెక్షన్ లోనే షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా కబీర్ సింగ్ పేరుతో వచ్చి హిందీలో భారీ హిట్ గా నిలిచింది. ఒక్క తమిళంలోనే ఆశించిన సక్సెస్ అందుకోలేదు.
ఇక హిందీలో రన్‌బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా వచ్చిన అనిమల్ సినిమా మరో సెన్షేషనల్. బాలీవుడ్ లో ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రష్మిక కూడా ఈ ఒక్క సినిమాతో హిందీలో స్టార్ గా మారింది. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా ని కనీసం ఓ పదేళ్ళపాటు చెప్పుకుంటారు. అంత గొప్ప పేరు వచ్చేసింది. ఇక ఈ సినిమా తర్వాత అటు హిందీ ఇండస్ట్రీలో ఇటు సౌత్ ఇండస్ట్రీలలో రాజమౌళి, రాం గోపాల్ వర్మ లాంటి వారి నుంచి కొత్తగా వచ్చిన దర్శకుల వరకూ అందరూ మాట్లాడుకున్నారు.
Also Read – Khairtabad Ganesh: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి
ఇక తాజాగా సందీప్ రెడ్డి వంగ, ఆర్జీవీ కలిసి జగపతిబాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకి హాజరైయ్యారు. ఇందులో చాలా విషయాలను పంచుకున్నారు సందీప్. గాయం సినిమాను కేవలం వర్మ కోసమే చూశానని చెప్పారు. అంతేకాదు, ఆర్జీవీ చేసిన సత్య చిత్రాన్ని ఓ 70 సార్లైనా చూసుంటానని వెల్లడించారు. ఇదే సమయంలో రాజమౌళి రూపొందించిన బాహుబలి 2 ఇంట్రవెల్ సీక్వెన్స్ గురించి చెప్పుకొచ్చారు. ఇంత గొప్ప ఇంట్రవెల్ సీన్ తన కెరీర్ లో ఇప్పటి వరకూ చూడలేదని తెలిపారు. ఈ సీన్ చూశాక అర్జున్ రెడ్డి ఇంట్రవెల్ సీన్ ని చాలాసార్లు చూసుకున్నాను. దీన్ని ప్రేక్షకులు ఒప్పుకుంటారా..? అని సందేహించానని తెలిపారు.
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా స్పిరిట్ టైటిల్ తో కాప్ స్టోరీని తెరపైకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా రిలీజ్ కానుంది. హీరోయిన్‌గా ఇప్పటికే, త్రిప్తి డిమ్రీని సెలెక్ట్ చేశారు. ముందు దీపిక పడుకొణె ని అనుకున్నప్పటికీ ఆమె పెట్టిన కండీషన్స్ కి సందీప్ ఈ ప్రాజెక్ట్ నుంచి తొలగించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య కాస్త కోల్డ్ వార్ కూడా జరిగింది. ఏదేమైనా ఇండస్ట్రీకి మరో ఆర్జీవీ వచ్చారని మాత్రం గట్టిగా ఫిక్సవొచ్చు.
Also Read – Meenakshi Chaudhary: హర్ట్ అయ్యా.. టాలీవుడ్ కి గుడ్ బై..


