Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభAryan Khan : షారుఖ్ తనయుడి ఎంట్రీ.. అఫీషియల్ గా పోస్ట్ చేసిన ఆర్యన్ ఖాన్..

Aryan Khan : షారుఖ్ తనయుడి ఎంట్రీ.. అఫీషియల్ గా పోస్ట్ చేసిన ఆర్యన్ ఖాన్..

- Advertisement -

Aryan Khan : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కొన్నాళ్ల క్రితం డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలుకి వెళ్ళొచ్చాడు. దీంతో కొన్ని రోజులు ఆర్యన్ ఖాన్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాడు. ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇద్దామనుకున్న సమయంలోనే అరెస్ట్ అవ్వడంతో కొన్ని నెలల పాటు ఆర్యన్ ఎవరికీ కనిపించలేదు.

ఆర్యన్ ఖాన్ ని హీరో చేద్దామని కరణ్ జోహార్ ట్రై చేశాడు. కానీ ఆర్యన్ మాత్రం తనకి హీరో అవ్వడం ఇష్టం లేదని రైటర్, దర్శకుడిగా మారతానంటూ ఫిక్స్ అయ్యాడు. షారుఖ్ కూడా ఇందుకు ఓకే చెప్పాడు. ప్రస్తుత షారుఖ్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ లోనే ఆర్యన్ ఖాన్ రచయిత, దర్శకుడిగా మొదటి సినిమా తెరక్కించబోతున్నాడు.

ఈ నేపథ్యంలో ఆర్యన్ తన స్క్రిప్ట్ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. రైటింగ్ పూర్తయింది. యాక్షన్ చెప్పడానికి ఎదురు చూస్తున్నాను అని తెలిపాడు. ఆర్యన్ ఖాన్ ని తండ్రి షారుఖ్ తన సొంత నిర్మాణ సంస్థలోనే లాంచ్ చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ కిడ్స్ అంతా యాక్టింగ్ సైడ్ వస్తుంటే ఆర్యన్ ఖాన్ దర్శకుడు అవుతాను అనడం విశేషం. మరి ఆర్యన్ మొదటి సినిమా ఎవరితో, ఏ రేంజ్ లో చేస్తాడో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad