కన్నడ సీనియర్ హీరో శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar) ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఆలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం తన సతీమణితో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు. శివ రాజ్‌కుమార్‌ను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపించారు. కొంతమంది ఆయనతో ఫొటోలు దిగారు.
కాగా గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్(Ramcharan) హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ‘ఆర్‌సీ 16’చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సమూవీలో శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి శివన్న లుక్ టెస్ట్ ఇప్పటికే పూర్తైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌లో ఉంటున్నారు.