Puri Sethupati: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాధ్ కి గత కొంతకాలంగా వరుసగా ఫ్లాప్స్ వస్తున్నాయి. రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో కంప్లీట్ గా బౌన్స్ బ్యాక్ అయ్యాడని అందరూ అనుకున్నారు. ఇక పూరికి తిరుగులేదని చెప్పుకున్నారు. కానీ, మళ్ళీ అదే పంథాలో ఫ్లాప్స్ వస్తూనే ఉన్నాయి.
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో, విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే పాన్ ఇండియా సినిమా వచ్చింది. ఈ సినిమాపై అందరూ చాలా నమ్మకంగా ఉన్నారు. పాన్ ఇండియా లెవల్ లో హిట్ కొడతామని చాలా నమ్మకంగా మాట్లాడుకున్నారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా సినిమా భారీ డిజాస్టర్‌గా మిగిలింది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే పూరి జగన్నాధ్ తన డ్రీం ప్రాజెక్ట్ అయిన జనగణమనని ఇదే విజయ్ దేవరకొండతో మొదలుపెట్టారు. కానీ, లైగర్ ఫ్లాప్ తర్వాత పక్కన పెట్టారు.
Also Read – MGBS Bus Services: ముగిసిన వరద ముప్పు: మళ్లీ కళకళలాడుతున్న ఎంజీబీఎస్, బస్సు సర్వీసులు ప్రారంభం!
పూరికి కంబ్యాక్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ సినిమాను రామ్‌తోనే తీశారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మళ్ళీ పూరికి ఫ్లాప్‌ని ఇచ్చింది. దీంతో మళ్ళీ పూరి కొత్త సినిమా మొదలుపెట్టడానికి చాలా సమయం తీసుకున్నారు. మన తెలుగులోనే చాలామంది స్టార్ హీరోల పేర్లు వినిపించాయి. కానీ, ఫైనల్ గా కోలీవుడ్ క్రేజీ యాక్టర్ విజయ్ సేతుపతితో కొత్త సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సంయుక్త మీనన్, కీలక పాత్రల్లో టబు, దునియా విజయ్ నటిస్తున్నారు.
శరవేగంగా పూరి సేతుపతి సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పూరి జగన్నాధ్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ టైటిల్‌తో పాటు టీజర్‌ని రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ మేరకు అనౌన్స్‌మెంట్ పోస్టర్ ని కూడా వదిలారు. కానీ, తమిళనాడు కరూరులో టీవీకే సభలో అనుకోని దుర్ఘటన జరిగింది. ఈ కారణంగా పూరి టీమ్ చెన్నైలోని గ్రీన్ పార్క్ హోటల్ లో ప్లాన్ చేసిన పూరి సేతుపతి టైటిల్, టీజర్ లాంచ్ ఈవెంట్ ని పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలో మళ్ళీ కొత్త తేదీ ప్రకటిస్తామని అధికారికంగా వెల్లడించారు. చూడాలి మరి పూరి సేతుపతిల మూవీ టీజర్ ని ఎప్పుడు వదులుతారో. కాగా, ఈ మూవీ టైటిల్ గా ‘బెగ్గర్’, ‘స్లమ్‌డాగ్’ అని ప్రచారంలో ఉన్నాయి.
Also Read – How to boil Eggs: గుడ్లు ఉడికేటప్పుడు పగులుతున్నాయా.. ఈ సింపుల్ టిప్ లో సమస్య పరార్!


