SIIMA 2025: దుబాయ్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన 13వ ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’ (సైమా) (South Indian International Movie Awards 2025) వేడుక సినీ అభిమానులను ఉర్రూతలూగించింది. 2024 సంవత్సరంలో తెలుగు, కన్నడ చిత్రాల్లో విశేష ప్రతిభ కనబరిచిన నటీనటులు, చిత్ర బృందాలకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను (siima awards 2025 winners) అందించారు. ఈ సంవత్సరం సైమా వేడుకల్లో ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం, సైన్స్ ఫిక్షన్ మూవీగా ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లి ఉత్తమ చిత్రంగా నిలిచింది. తెలుగులో అత్యధిక అవార్డులను సొంతం చేసుకున్న సినిమాలలో ‘పుష్ప2’ (Pushpa2), ‘కల్కి 2898 AD’ ముందు వరుసలో నిలిచాయి.
Also Read- Keerthy Suresh: లాయర్‌గా కీర్తి సురేష్ – మహానటి హీరోయిన్ నెక్స్ట్ మూవీపై అప్‌డేట్ ఇదే!
సైమా అవార్డ్స్ 2025 విన్నర్స్..
* ఉత్తమ నటుడు (Best Actor) – అల్లు అర్జున్ (Allu Arjun) తన అద్భుత నటనకు ‘పుష్ప2’ చిత్రానికిగాను ఈ అవార్డును గెలుచుకున్నారు.
* ఉత్తమ నటి (Best Actress) – రష్మిక (Rashmika) ‘పుష్ప2’ చిత్రంలో ఆమె నటనకు ఉత్తమ నటిగా నిలిచారు.
* ఉత్తమ దర్శకుడు (Best Director) – సుకుమార్ ‘పుష్ప2’ చిత్రాన్ని తెరకెక్కించినందుకు ఉత్తమ దర్శకుడిగా అవార్డును అందుకున్నారు.
* ఉత్తమ సంగీత దర్శకుడు (Best Music Director) – దేవి శ్రీ ప్రసాద్ ‘పుష్ప2’ చిత్రానికి అందించిన సంగీతానికి గాను ఈ అవార్డును గెలుచుకున్నారు.
* ఉత్తమ విలన్ (Best Villain) – కమల్ హాసన్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో తన ప్రతికూల పాత్రకు ప్రశంసలు అందుకున్నారు.
* ఉత్తమ సహాయ నటుడు (Best Supporting Actor) – అమితాబ్ బచ్చన్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో ఆయన నటనకు అవార్డును పొందారు.
* ఉత్తమ సహాయ నటి (Best Supporting Actress) – అన్నా బెన్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికిగాను ఉత్తమ సహాయ నటిగా గుర్తింపు పొందారు.
* ఉత్తమ సినిమాటోగ్రఫీ (Best Cinematography) – రత్నవేలు ‘దేవర’ చిత్రానికి అద్భుతమైన ఛాయాగ్రహణం అందించినందుకు అవార్డును అందుకున్నారు.
* ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా (Pride of Telugu Cinema) – అశ్వినీదత్ (వైజయంతీ మూవీస్) తెలుగు సినిమాకు అందించిన సేవలకు ఈ గౌరవాన్ని పొందారు.
Also Read- Spirit Movie: స్పిరిట్‌లో ప్రభాస్ తండ్రిగా చిరంజీవి.. క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్ టీమ్
సైమా క్రిటిక్ అవార్డ్స్ 2025:
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజ సజ్జా (హనుమాన్), ఉత్తమ నటి (క్రిటిక్స్): మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్), ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): ప్రశాంత్ వర్మ (హనుమాన్), ఇతర తెలుగు విజేతల్లో సత్య (మత్తు వదలరా 2 – ఉత్తమ హాస్య నటుడు), రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లే – ఉత్తమ గీత రచయిత), శిల్పారావ్ (చుట్టమల్లే – ఉత్తమ నేపథ్య గాయని), భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్ బచ్చన్ – ఉత్తమ పరిచయ నటి), మరియు నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్లు – ఉత్తమ నూతన నిర్మాత) ఉన్నారు. కన్నడ విభాగంలో కూడా అనేక మంది నటీనటులు, దర్శకులు అవార్డులు గెలుచుకున్నారు, అందులో ఉపేంద్ర (యూఐ – ఉత్తమ దర్శకుడు), కిచ్చా సుదీప్ (ఉత్తమ నటుడు), ఆషిక రంగనాథ్ (ఉత్తమ నటి), మరియు ‘కృష్ణం ప్రణయ సఖి’ (ఉత్తమ చిత్రం) వంటివి ఉన్నాయి.


