Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో చాలా యాక్టింగ్‌గా ఉంటుంది. కొత్త సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను రెగ్యులర్‌గా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రమ్‌లో నిహారిక కొణిదెల పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. సారీ అమ్మ అంటూ తల్లికి క్షమాపణలు చెప్పింది.
వాటర్‌ఫాల్ వద్ద నిహారిక…
కొండ ప్రాంతంలో వేగంగా ప్రవాహిస్తున్నఓ వాటర్ ఫాల్ దగ్గర ఆనందంతో గంతులు వేస్తున్న ఓ వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది నిహారిక. పరవళ్లు తొక్కుతున్న జలపాతానికి తోడు వేగంగా వీస్తున్న గాలి, ఎగిసిపడుతున్న నీటి తుంపరలతో ఆ చోటు కాస్తంత ప్రమాదకరంగానే కనిపిస్తుంది. అయినా నిహారిక ఏ మాత్రం భయం, జంకు లేకుండా జలపాతం దగ్గరకు వెళ్లింది. ఆ వాటర్ ఫాల్ అందాలను ఆస్వాదిస్తూ నిహారిక కొణిదెల కనిపించింది.
Also Read – AI stethoscope: గుండెవ్యాధుల గుట్టు..ఏఐ స్టెతస్కోప్ కనిపెట్టు
అమ్మ ప్రార్ధనలు…
నేను ఎప్పుడు ట్రిప్‌కు వెళ్లినా క్షేమంగా తిరిగిరావాలని అమ్మ ప్రార్ధనలు చేస్తుంది. నేను మాత్రం ట్రిప్‌లలో ఇలా ఉంటాను… సారీ అమ్మ అంటూ ఈ పోస్ట్‌లో నిహారిక రాసుకొచ్చింది. నిహారిక పోస్ట్ కు ఆమె వదిన లావణ్య త్రిపాఠి రిప్లై ఇచ్చింది. లాఫింగ్ ఎమోజీని పోస్ట్ చేసింది. నిహారిక చేసిన సాహసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
కమిటీ కుర్రాళ్లుతో హిట్…
గత ఏడాది రిలీజైన కమిటీ కుర్రాళ్లు మూవీతో నిర్మాతగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నిహారిక కొణిదెల. తొలి అడుగులోనే పెద్ద విజయాన్ని అందుకున్నది. పది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఇరవై ఐదు కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కమిటీ కుర్రాళ్లు హిట్ తర్వాత పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రస్తుతం ఓ రొమాంటిక్ కామెడీ మూవీ చేయబోతుంది నిహారిక. సంగీత్ శోభన్, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. నిహారిక నిర్మించిన ఒక ఫ్యామిలీ స్టోరీ, బెంచ్ లైఫ్, హలో వరల్డ్‌తోపాటు మరికొన్ని సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
యాక్టింగ్ మాత్రం కలిసిరాలేదు…
నిర్మాతగా సక్సెస్‌లను అందుకున్న నిహారికకు యాక్టింగ్ మాత్రం అంతగా కలిసిరాలేదు. ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా తొలి అడుగు వేసింది. సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది. ఈ మూడు సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. గత ఏడాది తమిళ మూవీ మద్రాస్ కారణ్‌తో యాక్టింగ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ మూవీ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
2020లో చైతన్య జొన్నలగడ్డను పెళ్లిచేసుకుంది నిహారిక. మనస్పర్థల కారణంగా చైతన్యకు దూరమైన నిహారిక 2023లో అతడి నుంచి విడాకులు తీసుకుంది.
Also Read – Rahul Gandhi Slams Govt: ప్రభుత్వ ఆసుపత్రులు ‘మృత్యు నిలయాలు’.. రాహుల్ గాంధీ ఫైర్


