Sreeleela: అదృష్టం అంటే శ్రీలీలదేనని సినీ వర్గాలు చెబుతోన్నాయి. హీరోయిన్‌గా ఇప్పటివరకు 14 సినిమాలు చేసింది. అందులో మూడే హిట్లు. అయినా శ్రీలీలకు అవకాశాలకు కొదవ లేదు.తెలుగులోనే కాదు తమిళం, హిందీ భాషల్ల నుంచి ఆఫర్ల మీద ఆఫర్లు అందుకుంటోంది.
పరాశక్తి మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది శ్రీలీల. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు.
పరాశక్తి రిలీజ్ కాకముందే తమిళంలో మరో ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల. డాన్ బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో శివకార్తికేయన్, డైరెక్టర్ సిబి చక్రవర్తి కలిసి ఓ సినిమా చేస్తోన్నారు. డార్క్ హ్యూమర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల ఫైనల్ అయినట్లు సమాచారం. పరాశక్తి మూవీలో శివకార్తికేయన్, శ్రీలీల కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందట. యాక్టింగ్‌తో పాటు డ్యాన్సుల్లో శ్రీలీల గ్రేస్‌కు శివకార్తికేయన్ ఫుల్‌గా ఇంప్రెస్ అయినట్లు సమాచారం. సిబి చక్రవర్తి మూవీలో హీరోయిన్‌గా శ్రీలీలను రికమండ్ చేసినట్లు సమాచారం. మరో వారం, పది రోజుల్లో ఈ మూవీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతున్నట్లు చెబుతోన్నారు.
Also Read – Delhi blast effect: కోల్‌కతాలో హై అలర్ట్.. భారత్-సౌతాఫ్రికా ఆటగాళ్లకు భద్రత పెంపు..
శ్రీలీల డెబ్యూ మూవీ పరాశక్తి రిలీజ్ కాకముందే శివకార్తికేయన్, సిబీ చక్రవర్తి మూవీ సెట్స్‌పైకి రాబోతుంది. నవంబర్ నెలాఖరున లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో లాంఛ్ కానుందట. ఈ రెండు సినిమాలే కాకుండా తమిళంలో శ్రీలీల మరికొన్ని కథలు వింటున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు సినిమాలను తగ్గించి కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యిందట ఈ బ్యూటీ.
తెలుగులో శ్రీలీల ఎక్కువగా కమర్షియల్ సినిమాలే చేసింది. దర్శకులు ఆమెను గ్లామర్ కోణంలోనే చూపించారు. తమిళ సినిమాలతో ఆ ముద్ర నుంచి బయటపడాలని ప్లాన్ చేస్తుందట. అందుకే తెలుగులో అవకాశాలు వస్తున్నా వాటిపై అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదని, కోలీవుడ్ సినిమాలు చేయడానికే ఎక్కువగా ఆసక్తిని చూపుతుందట. పరాశక్తి మూవీలో స్టూడెంట్ లీడర్‌గా యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో శ్రీలీల కనిపించబోతున్నది.
కాగా ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్‌లో హీరోయిన్‌గా శ్రీలీల కనిపించబోతున్నది. తెలుగులో ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక మూవీ ఇదే. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా మరో నాయికగా నటిస్తోంది. ఆషికీ 3 మూవీతో శ్రీలీల బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది.
Also Read – Red Fort Blast : ఎర్రకోట వద్ద రక్తపుటేర్లు.. “మా కళ్ల ముందే మనుషులు ముక్కలయ్యారు!”


