Stranger Things Season 5 Budget : నెట్‌ఫ్లిక్స్ చరిత్రలో అత్యంత పాపులర్ సిరీస్‌లలో ‘స్ట్రేంజర్ థింగ్స్’ మొదటిది. 2016లో మొదలైన ఈ సై-ఫై హారర్ సిరీస్, 4 సీజన్‌లతో ప్రపంచ ప్రేక్షకులను అలరించింది. ఎలెవెన్ (మిల్లీ బాబీ బ్రౌన్), మైక్ (ఫిన్ వోల్ఫ్‌హార్డ్), డస్టిన్ (గాటెన్ మాటరాజ్) వంటి క్యారెక్టర్లతో 1980ల సెట్టింగ్, అప్‌సైడ్ డౌన్ రహస్యాలు, వెక్నా భయం అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు చివరి సీజన్ 5 సిద్ధంగా ఉంది. మూడేళ్ల నిరీక్షణ తర్వాత, ఈ సీజన్ సినిమా స్థాయిలో రానుంది. మొత్తం బడ్జెట్ రూ.4,000-5,000 కోట్లు, ఒక్కో ఎపిసోడ్‌కు రూ.450-550 కోట్లు – ఇది ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ (రూ.3,200 కోట్లు)ను మించి, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీవీ సిరీస్‌గా నిలుస్తుంది.
ALSO READ: AP Liquor Scam Remand Extension : ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు
సీజన్ 5లో 8 ఎపిసోడ్‌లు, మొత్తం నిడివి 11 గంటలు (90-120 నిమిషాలు). డఫర్ బ్రదర్స్ (క్రియేటర్స్) 650 గంటలకు పైగా ఫుటేజ్ చిత్రీకరించారు. కథ 1987లో మొదలవుతుంది. హ్యాకిన్స్ పట్టణం అప్‌సైడ్ డౌన్ చీలికలతో ధ్వంసమవుతుంది. వెక్నా అదృశ్యమైనా, హీరోలు అతన్ని కనుగొని అంతం చేయాలి. ప్రభుత్వం హ్యాకిన్స్‌ను సైనిక నిర్బంధంగా మార్చి, ఎలెవెన్‌ను వెతుకుంటుంది. ఎలెవెన్ శక్తి కోల్పోయి, విల్ బైర్స్ అదృశ్యమైనా, భయంకర చీకటి ముంచుకొస్తుంది. ఇది హీరోల అత్యంత భయంకరమైన చివరి యుద్ధం. VFX, సెట్‌లు, తారాగణం (మిల్లీ బాబీ బ్రౌన్, వినోనా రైడర్, డేవిడ్ హార్బర్, జామీ క్యాంప్‌బెల్ బౌవర్) కోసం భారీ ఖర్చు. కొత్తగా ‘టెర్మినేటర్’ ఫేమ్ లిండా హామిల్టన్ చేరుతోంది.
నెట్‌ఫ్లిక్స్ ఉత్సాహం పెంచేందుకు 3 వాల్యూమ్‌లలో విడుదలకానుంది.
వాల్యూమ్ 1 (4 ఎపిసోడ్‌లు) నవంబర్ 26, 2025
వాల్యూమ్ 2 (3 ఎపిసోడ్‌లు) డిసెంబర్ 25 (క్రిస్మస్)
వాల్యూమ్ 3 (గ్రాండ్ ఫినాలే) డిసెంబర్ 31 (న్యూయేర్).
డఫర్ బ్రదర్స్ “ఇది మా కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైనది” అని తెలిపారు. అభిమానులు “ఎలెవెన్ ఎండ్ ఎలా?” అని ట్రెండ్ చేస్తున్నారు. సిరీస్ మొత్తం 1.5 బిలియన్ గంటల వ్యూస్, 2025లో మరో రికార్డు సృష్టిస్తుందని అంచనా.


