Ram Charan: మెగా హీరో రామ్‌చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ అంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. రామ్‌చరణ్‌లోని అసలైన నటుడిని రంగస్థలంతోనే వెలికితీశారు సుకుమార్. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా రా అండ్ రస్టిక్ స్టోరీస్‌కు రామ్‌చరణ్ న్యాయం చేయగలడని ఈ మూవీ నిరూపించింది. హీరోగా రామ్‌చరణ్‌ను నెక్స్ట్ లెవెల్‌లో నిలబెట్టింది.
మరోసారి సెట్…
రంగస్థలం తర్వాత రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్ మరోసారి సెట్టయ్యింది. పెద్ది పూర్తయిన వెంటనే సుకుమార్ మూవీని మొదలుపెట్టబోతున్నాడు రామ్‌చరణ్. ఆర్‌సీ 17 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ కోసం కథను సిద్ధం చేసే పనిలో పడ్డాడు సుకుమార్. ఇటీవలే తన టీమ్‌తో కలిసి బ్యాంకాక్ వెళ్లిన సుకుమార్.. చరణ్ కోసం ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేసినట్లు సమాచారం. హాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన మెకన్నాస్ గోల్డ్ తరహాలో యాక్షన్ అడ్వెంచర్ డ్రామా రామ్‌చరణ్, సుకుమార్ మూవీ ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రామ్‌చరణ్ కెరీర్‌లోనే మోస్ట్ స్టైలిష్ యాక్షన్ సినిమాగా నిలుస్తుందని చెబుతున్నారు.
Also Read- Tadipatri: తాడిపత్రిలో గణేష్ శోభాయాత్రలో ఉద్రిక్తత.. జేసీ , కాకర్ల రంగనాథ్ వర్గీయుల మధ్య రాళ్లదాడి
పుష్పకు భిన్నంగా…
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప, పుష్ప 2 బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. రంగస్థలం, పుష్ప సిరీస్ సినిమాలు రా అండ్ రస్టిక్ అంశాలతో మాస్ యాక్షన్ సినిమాలుగా రూపొందాయి. ఈ సారి వాటికి భిన్నంగా సరికొత్త జానర్‌లో సినిమాను తెరకెక్కించి దర్శకుడిగా వైవిధ్యతను చాటుకోవాలనే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లు చెబుతోన్నారు.
పెద్ది మైసూర్ షెడ్యూల్ ముగించుకొని రామ్‌చరణ్ హైదరాబాద్ రాగానే.. అతడికి సుకుమార్ కథను వినిపించబోతున్నట్లు చెబుతోన్నారు. పెద్ది మూవీ రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ రిలీజైన వెంటనే రామ్‌చరణ్, సుకుమార్ సినిమా సెట్స్‌పైకి రానున్నట్లు సమాచారం.
Also Read- Allu Arjun: గామా అవార్డుల్లో మెరిసిన అల్లు అర్జున్…ఏకంగా నాలుగు అవార్డులు!
మైసూర్‌లో సాంగ్ షూట్…
ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు రామ్‌చరణ్. ప్రస్తుతం రామ్‌చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్‌ను మైసూర్‌లో షూట్ చేస్తున్నారు. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా బుచ్చిబాబు సానా ఈ మూవీని తెరకెక్కిస్తోన్నారు. పెద్దిలో రామ్‌చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ అగ్ర హీరో శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.


