Friday, April 4, 2025
Homeచిత్ర ప్రభSuresh Sangaiah: కోలీవుడ్‌లో విషాదం.. యువ దర్శకుడు మృతి

Suresh Sangaiah: కోలీవుడ్‌లో విషాదం.. యువ దర్శకుడు మృతి

తమిళ సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. కొన్ని రోజులుగా కాలేయం సంబంధిత వ్యాధులతో బాధపడిన యువ దర్శకుడు సురేశ్ సంగయ్య(Suresh Sangaiah) మృతి చెందారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు ఆయన కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సురేశ్‌ మృతిపై సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. కాగా సురేశ్ 2017లో ‘ఒరు కిడైయిన్ కరు మను’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. గతేడాది ‘సత్య సొతనై’ మూవీతో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందారు.

- Advertisement -

కాగా ఇటీవల తమిళ పరిశ్రమను ఇటీవల వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. కరోనా వచ్చిన దగ్గరి నుంచి చాలా మంది దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు మృతి చెందారు. తాజాగా సీనియర్ నటుడు ఢిల్లీ గణేశ్‌ కన్నుమూసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News