Rashmika Mandanna: రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ హారర్ కామెడీ మూవీ థామా మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. 2025లో బాలీవుడ్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన నాలుగో మూవీగా థామా నిలిచింది. వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ డే థామా మూవీ 24 కోట్ల వసూళ్లను దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ ఏడాది బాలీవుడ్‌లో తొలిరోజు అత్యధిక వసూళ్లను దక్కించుకున్న టాప్ ఫోర్ సినిమాల్లో రష్మిక మందన్నవే మూడు ఉండటం గమనార్హం. ఈ లిస్ట్‌లో 31 కోట్లతో ఛావా ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా… 29 కోట్లతో వార్ 2 రెండో స్థానంలో నిలిచింది. సల్మాన్ ఖాన్ సికందర్ మూవీ 26 కోట్లతో మూడో ప్లేస్‌ను సొంతం చేసుకోగా… 24 కోట్ల వసూళ్లతో నాలుగో స్థానంలో థామా నిలిచింది. ఛావా, సికందర్‌తో పాటు థామాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించడం గమనార్హం. రష్మిక క్రేజ్‌కు నిదర్శనమిదని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
థామా మూవీకి ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడం కలిసివచ్చింది. రెండో రోజుతో ఈ హారర్ కామెడీ మూవీ యాభై కోట్ల మార్కును టచ్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. బుధవారం రోజు కూడా థామా జోరు కొనసాగడం ఖాయమని అంటున్నారు. తొలిరోజు వసూళ్లకు మించి కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
Also Read – Salman Khan: సల్మాన్ ఖాన్ నా ఎడిటర్‌ను కిడ్నాప్ చేశాడు: అభినవ్ కశ్యప్ సంచలన ఆరోపణ
థామా మూవీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించాడు. నవాజుద్ధీన్ సిద్ధిఖీ విలన్‌గా కనిపించిన ఈ మూవీకి ఆదిత్య సర్పోట్దర్ దర్శకత్వం వహించాడు. మాడాక్ హారర్ ఫిల్మ్ యూనివర్స్‌లో భాగంగా థామా తెరకెక్కింది.
థామా మూవీలో తడ్కా అనే బేతాళ జాతి యువతిగా గ్లామర్, యాక్షన్ కలగలసిన క్యారెక్టర్‌లో రష్మిక నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. మాడాక్ యూనివర్స్‌లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలకు భిన్నంగా హారర్ ఎలిమెంట్స్‌కు లవ్‌స్టోరీని జోడించి దర్శకుడు ఆదిత్య సర్పోట్దర్ ఈ మూవీని రూపొందించారు.
థామా మూవీ మంగళవారం హిందీతో పాటు తెలుగులో రిలీజైంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ మాత్రం బాక్సాఫీస్ వద్ద పూర్తిగా తేలిపోయింది. తొలిరోజు తెలుగు వెర్షన్ అతి కష్టంగా 25 లక్షల వరకు వసూళ్లను దక్కించుకున్నది. రష్మికకు తెలుగులో భారీగానే క్రేజ్ ఉన్నా ప్రమోషన్స్ సరిగా చేయకపోవడంతో తెలుగు వెర్షన్ ఏ మాత్రం ప్రభావాన్ని చూపించలేకపోయింది.
మాడాక్ హారర్ యూనివర్స్‌లో గతంలో వచ్చిన స్త్రీ 2 మూవీ రికార్డును మాత్రం థామా దాటలేకపోయింది. శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ తొలిరోజు 50 కోట్ల వసూళ్లను దక్కించుకున్నది. స్త్రీ2 లో సగం మాత్రమే థామా కలెక్షన్స్‌ను దక్కించుకుంది.
ప్రస్తుతం రష్మిక బాలీవుడ్‌తో పాటు తెలుగులో ఫుల్ బిజీగా ఉంది. హిందీలో కాక్ టెయిల్ 2 సినిమా చేస్తోంది. తెలుగులో ది గర్ల్‌ఫ్రెండ్, మైసాతో పాటు కాబోయే భర్త విజయ్ దేవరకొండతో ఓ మూవీలో నటిస్తోంది.
Also Read – Mega Star: ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ షూటింగ్‌లో వెంకీ మామ!


