Monday, May 12, 2025
Homeచిత్ర ప్రభThammudu: నితిన్ 'త‌మ్ముడు' మూవీ నుంచి స్పెష‌ల్ వీడియో

Thammudu: నితిన్ ‘త‌మ్ముడు’ మూవీ నుంచి స్పెష‌ల్ వీడియో

‘వకీల్ సాబ్’ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ హీరోగా నటిస్తోన్న ‘త‌మ్ముడు'(Thammudu) చిత్రం నుంచి స్పెష‌ల్ వీడియోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ఈ వీడియోను అభిమానుల‌తో పంచుకుంది. మూవీలో న‌టించిన నితిన్‌, ల‌య‌, స‌ప్త‌మీ గౌడ‌, శ్వాసికా విజ‌య్‌, సౌర‌భ్ స‌చ్‌దేవ‌, వ‌ర్ష బొల్ల‌మ్మ పాత్ర‌ల‌ను ఇందులో ప‌రిచ‌యం చేశారు.

- Advertisement -

ఇదిలా ఉంటే చాలా గ్యాప్ త‌ర్వాత సీనియ‌ర్ న‌టి ల‌య మ‌రోసారి ఈ చిత్రం ద్వారా మ‌ళ్లీ తెర‌పై క‌నిపించ‌నుండటం విశేషం. ఆమె నితిన్‌ అక్క పాత్రల్లో నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా జూలై 4వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాకు అజ‌నీశ్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News